Maoist Rebel Ruben Surrenders: 44 ఏళ్ల అజ్ఞాతానికి వీడ్కోలు
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:00 AM
సీపీఐ మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ 44 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మంద రూబెన్ అలియాస్ కన్నన్న, మంగన్న, సురేశ్ లొంగిపోయాడని...
పోలీసులకు లొంగిపోయిన మావోయిస్టు రూబెన్
రూ.8 లక్షల రివార్డు అందజేసిన వరంగల్ సీపీ
వరంగల్ క్రైం, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): సీపీఐ మావోయిస్టు పార్టీలో వివిధ హోదాల్లో పనిచేస్తూ 44 ఏళ్లుగా అజ్ఞాతంలో ఉన్న మంద రూబెన్ అలియాస్ కన్నన్న, మంగన్న, సురేశ్ లొంగిపోయాడని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ తెలిపారు. రూబెన్ తన ఎదుట లొంగిపోయాడని మంగళవారం మీడియాకు సీపీ తెలిపారు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం వంగపహాడ్ వాసి మంద రూబెన్ 1979లో నాటి ఆర్‌ఈసీ మెస్ విభాగ ఉద్యోగిగా.. మావోయి స్టు పార్టీ మాజీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు పిలుపుతో అజ్ఞాతంలోకి వెళ్లినప్పటి నుంచి అజ్ఞాతంలో ఉన్న రూబెన్ 1991లో అనారోగ్యంతో చికిత్స కోసం కొత్తగూడెం వెళుతుండగా చత్తీ్‌సగఢ్ పోలీసులు అరెస్టు చేసి జగదల్పూర్ జైలుకు తరలించారు. ఏడాది తర్వాత రూబెన్ మరో ముగ్గురు ఖైదీలతో కలిసి జైలు నుంచి తప్పించుకుని అజ్ఞాతంలోనే పని చేస్తున్నా 2005లో అనారోగ్యానికి గురైనప్పటి నుంచి బీజాపూర్ జిల్లా గుండ్రాయిలో ఉంటూ మావోయిస్టులకు సహకరిస్తున్నాడు. ఆరోగ్యం సహకరించక ప్రసు ్తతం పోలీసులకు లొంగిపోయాడు. రూబెన్‌పై ఉన్న రూ.8లక్షల రివార్డును అందజేశామని సీపీ తెలిపారు.