Maoist Leader Loketi Ramesh Surrenders: మావోయిస్టు నేత రమేశ్ లొంగుబాటు
ABN , Publish Date - Dec 03 , 2025 | 03:37 AM
కామారెడ్డి జిల్లా ఇస్రోజి వాడకు చెందిన మావోయిస్ట్ నేత లోకేటి రమేశ్ అలియాస్ అశోక్ అలి యాస్ నరేందర్ అలియాస్ రాజేశ్వర్ మంగళవారం జనగామ వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్...
జనగామ, డిసెంబరు 2 (ఆంధ్ర జ్యోతి): కామారెడ్డి జిల్లా ఇస్రోజి వాడకు చెందిన మావోయిస్ట్ నేత లోకేటి రమేశ్ అలియాస్ అశోక్ అలి యాస్ నరేందర్ అలియాస్ రాజేశ్వర్ మంగళవారం జనగామ వెస్ట్‌జోన్ డీసీపీ రాజమహేంద్రనాయక్ ఎదుట లొంగిపోయారు. రమేశ్‌పై రూ. 8లక్షల రివార్డు ఉండగా, తక్షణ సాయంగా రూ.25 వేలు అందిం చారు. లోకేటి రమేశ్ అలియాస్ అశోక్ 2005లో తన సోదరి లావణ్యతో కలిసి సీపీఐ మావోయిస్ట్ పార్టీలో చేరాడు. ఏడాది పాటు సెంట్రల్ కమిటీ సభ్యురాలు పోతుల కల్పన అలియాస్ సుజాత దగ్గర పనిచేసి చైతన్యనాట్య మంచ్(సీఎన్‌ఎం)కు బదిలీ అయ్యాడు. 2016లో పామేడ్ ఏరియా కమిటీ మెంబర్ లొగొట్టా బొజ్జి అలియాస్ కమలను వివాహం చేసుకున్నాడు. కమల 2023లో అరెస్టై రిమాండ్‌లో ఉంది. రమేశ్ తండ్రి లోకేటి రాజేందర్‌రావు అలియాస్ చందర్ ప్రస్తు తం దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ వెస్ట్ సబ్‌జోనల్ బ్యూరో సెక్రటరీ పనిచేస్తున్నాడు. మావోయిస్టులు జనజీవన స్రవంతిలో కలవాలని డీసీపీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.