Rajanna Sircilla: మావోయిస్టు కోసా అంత్యక్రియలు పూర్తి
ABN , Publish Date - Sep 26 , 2025 | 07:11 AM
అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు కోసా అలియాస్ కడారి సత్యనారాయణరెడ్డి అంత్యక్రియలు రాజన్న సిరిసిల్ల జిల్లా...
తంగళ్లపల్లి, సెప్టెంబరు 25(ఆంధ్రజ్యోతి): అబూజ్‌మడ్ ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన మావోయిస్టు పార్టీ సెంట్రల్ కమిటీ సభ్యుడు కోసా అలియాస్ కడారి సత్యనారాయణరెడ్డి అంత్యక్రియలు రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గోపాల్‌రావ్‌పల్లిలో పూర్తయ్యాయి. వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల నాయకులు నివాళులర్పించారు. అంతిమయాత్ర 3 గంటల పాటు కొనసాగింది. భారత్ బచావో జాతీయ అధ్యక్షుడు గాదె ఇన్నయ్య, విరసం నేత పాణి, పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి నారాయణరావ్ అంతిమ యాత్రలో పాల్గొన్నారు.