Share News

Maoist Leader Kalpana: మావోయిస్టు పార్టీ నేత కల్పన లొంగుబాటు!

ABN , Publish Date - Sep 13 , 2025 | 04:18 AM

మావోయిస్టు పార్టీ అగ్రనేత దివంగత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ భార్య పోతుల కల్పన అలియాస్‌ మైనక్క తెలంగాణ పోలీసుల ముందు...

Maoist Leader Kalpana: మావోయిస్టు పార్టీ నేత కల్పన లొంగుబాటు!

  • 8 ఆమె మల్లోజుల కిషన్‌జీ సతీమణి

హైదరాబాద్‌, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టు పార్టీ అగ్రనేత దివంగత మల్లోజుల కోటేశ్వరరావు అలియాస్‌ కిషన్‌జీ భార్య పోతుల కల్పన అలియాస్‌ మైనక్క తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారని సమాచారం. ఆమెతో పాటు మరో ముగ్గురు లొంగిపోయినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పోలీసు ఉన్నతాధికారులు శనివారం ప్రకటించనున్నారని సమాచారం. గద్వాల జిల్లా గట్టు మండలం పెంచికల్‌పేటకు చెందిన కల్పన డిగ్రీ చదువుతున్న సమయంలో 1983లో ఆర్‌ఎ్‌సయూలో చేరి ఆ తర్వాత పార్టీలో పూర్తి స్థాయి కార్యకర్తగా మారారు. లాల్‌గఢ్‌ ఉద్యమ నేత, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన మల్లోజుల కోటేశ్వరరావును ఆమె వివాహం చేసుకున్నారు. మల్లోజుల బెంగాల్‌ ఎన్‌కౌంటర్‌లో మరణించిన సంగతి విదితమే.

Updated Date - Sep 13 , 2025 | 04:18 AM