Share News

kumaram bheem asifabad- మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి

ABN , Publish Date - Jul 08 , 2025 | 10:44 PM

జిల్లాలో ఇందిరా సౌర గిరిజన జల వికాసం పథకం అమలుకు మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి సమగ్ర గిరిజనాభివృద్ధి పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, కాగజ్‌నగర్‌ డివిజనల్‌ అటవీ శాఖాధికారి సువాంత్‌ బోబడేలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహఙంచారు.

kumaram bheem asifabad-  మండల స్థాయి కమిటీలు ఏర్పాటు చేయాలి
మాట్లాడుతున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, పాల్గొన్న ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, కాగజ్‌నగర్‌ డివిజనల్‌ అటవీ శాఖాధికారి సువాంత్‌ బోబడే

ఆసిఫాబాద్‌, జూలై 8 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇందిరా సౌర గిరిజన జల వికాసం పథకం అమలుకు మండల స్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో గల వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి సమగ్ర గిరిజనాభివృద్ధి పీవో ఖుష్బూ గుప్తా, అదనపు కలెక్టర్‌ దీపక్‌ తివారి, కాగజ్‌నగర్‌ డివిజనల్‌ అటవీ శాఖాధికారి సువాంత్‌ బోబడేలతో కలిసి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహఙంచారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రభుత్వం గిరిజనుల కోసం ఆర్‌ఓఎఫ్‌ఆర్‌ పోడు పట్టాలు కలిగిన అర్హత గల రైతులకు ఇందిరా సౌర గిరిజల వికాసం పథకాన్ని ప్రారంభించామని చెప్పారు. ఈ పథకం కింద మొదటి విడతలో అర్హులైన పోడు పట్టా భూములలో సాగు నీరు అందించడం కోసం బోర్లు, వ్యవసాయ బావులను మంజూరు చేసి సౌర విద్యుత్‌ అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. రెండున్నర ఎకరాలు కలిగిన అర్హులైన రైతులకు బోరు సౌకర్యం, రెండున్నర ఎకరాల లోపు ఉన్న రైతులు ఉంటే ఇద్దరు రైతులు కలిపి బోర్లు, బావిని నిర్మించే అవకాశం ఉందని తెలిపారు. మొత్తం ఐదు విడుతలుగా కార్యక్రమం ఉంటుందని చెప్పారు. అటవీ శాఖ నుంచి ఎలాంటి అడ్డంకులు ఉండవని ఈ పథకం అమలుకు మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి నివేదికలు అందించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి రమాదేవి, డీఆర్‌డీఓ దత్తారావు, జిల్లా వ్యవసాయాధికారి శ్రీనివాసరావు, ఉద్యానవనాధికారి నదీం, మిషన్‌ భగీరథ ఈఈ సిద్దక్‌, విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శేషరావు తదితరులు పాల్గొన్నారు.

కంట్రోల్‌ రూం ఏర్పాటు

ఆసిఫాబాద్‌, (ఆంధ్రజ్యోతి): ప్రస్తుతం జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో కంట్రోల్‌ రూం ఏర్పాటు చేశామని కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. స్థానికంగా మంగళవారం ఆయన మాట్లాడారు. జిల్లాలోని లోతట్టు ప్రాంతాలు, వరద ప్రభావిత ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించి వరద పరిస్థితులను ప్రజలకు ముందస్తుగా తెలియజేసి సురక్షిత ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల ప్రాణ, ఆస్తుల రక్షణ దిశగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉందన్నారు. ప్రజల సౌకర్యార్థం జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్‌ భవన సముదాయంలో కంట్రోల్‌ రూం 8500844365 నంబరును ఏర్పాటు చేశామని అన్నారు. సహాయం, ఇతర సౌకర్యాల కోసం ప్రజలు సంప్రదించవచ్చని. 24 గటలు అందుబాటులో ఉంటామని చెప్పారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. అనంతరం ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో రాష్ట్ర విభక్తుల నిర్వహణ శాఖ ద్వారా ఐదు లక్షల రూపాయల వ్యయంతో సమకూర్చిన నాలుగు సీట్లతో కూడిన బోటు, 50 లైఫ్‌ జాకెట్లు, 20 రబ్బర్‌ ట్యూబులు, ఒక కోత యంత్రంలను జిల్లా ఎస్పీ సుభాష్‌ కాంతిలాల్‌, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, ఎమ్మెల్సీ దండే విఠల్‌, అదనపు కలెక్టర్లు దీపక్‌ తివారి, డేవిడ్‌లతో కలిసి పరిశీలించి అగ్నిమాపక శాఖకు అందజేశారు.

Updated Date - Jul 08 , 2025 | 10:44 PM