Share News

హెచ్‌1బీపై పార్లమెంటులో చర్చించాలి: మల్లు రవి

ABN , Publish Date - Sep 22 , 2025 | 06:44 AM

అమెరికా హెచ్‌1బీ వీసా రుసుమును విపరీతంగా పెంచడాన్ని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి వ్యతిరేకించారు.

హెచ్‌1బీపై పార్లమెంటులో చర్చించాలి: మల్లు రవి

హైదరాబాద్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): అమెరికా హెచ్‌1బీ వీసా రుసుమును విపరీతంగా పెంచడాన్ని నాగర్‌కర్నూల్‌ ఎంపీ మల్లు రవి వ్యతిరేకించారు. దీనిపై తగిన విధంగా స్పందించడానికి పార్లమెంటు ప్రత్యేక సమాశాలు నిర్వహించాలని ప్రధానిని ఓ ప్రకటనలో కోరారు. ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ తీసుకున్న ఈ నిర్ణయం భారత ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా అమెరికా వెళ్లాలనుకుంటున్న భారతీయ యువతపై తీవ్ర ప్రభావం చూపుతుందని మల్లు రవి అభిప్రాయపడ్డారు.

Updated Date - Sep 22 , 2025 | 06:45 AM