మల్లేశానికి గద్దర్ అవార్డు అభినందనీయం
ABN , Publish Date - Jun 03 , 2025 | 12:00 AM
ఆసు యంత్రం సృష్టించి పద్మశ్రీ అవార్డు అందుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన చింతకింది మల్లేశానికి ‘మల్లేశం’ సినిమా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుకు ఎంపికై మరో చరిత్ర సృష్టించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు.
ఆలేరు, జూన్ 2(ఆంధ్రజ్యోతి): ఆసు యంత్రం సృష్టించి పద్మశ్రీ అవార్డు అందుకున్న యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరుకు చెందిన చింతకింది మల్లేశానికి ‘మల్లేశం’ సినిమా ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గద్దర్ అవార్డుకు ఎంపికై మరో చరిత్ర సృష్టించడం అభినందనీయమని ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మల్లేశంను ఆయన సోమవారం సన్మానించారు. ఈ అవార్డులతో ఆలేరు ఖ్యాతిని రాష్ట్ర వ్యాప్తంగా చాటారన్నారు. వారికి ప్రభుత్వ పరంగా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయన్నారు. కార్యక్రమంలో నాయకులు పాశికంటి శ్రీనివాస్, ఆడెపు బాలస్వామి, బేతి రాములు, బింగి నర్సింహులు, బడుగు జహంగీర్, శ్రావణ్, సిద్దులు, నారాయణ, బోగ సంతోష్, కటకం బాలరాజు పాల్గొన్నారు.