Congress leader Mallu Ravi: కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకో
ABN , Publish Date - Sep 30 , 2025 | 04:44 AM
కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని కాంగ్రెస్ ఎంపీల తెలంగాణ ఫోరం కన్వీనర్ మల్లు రవి హితబోధ చేశారు. ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం లేకుం....
న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 (ఆంధ్రజ్యోతి): కేటీఆర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని కాంగ్రెస్ ఎంపీల తెలంగాణ ఫోరం కన్వీనర్ మల్లు రవి హితబోధ చేశారు. ముఖ్యమంత్రి అనే కనీస గౌరవం లేకుండా రేవంత్ రెడ్డిని చిల్లర భాషతో నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. తనపై దాడి జరగాలనే ఉద్దేశంతోనే కేటీఆర్ ఇలా వ్యవహరిస్తున్నారని, తద్వారా సానుభూతి సంపాదించుకోవాలనే నీచ రాజకీయాలకు తెరలేపారని మండిపడ్డారు. పదేళ్లు నిరుద్యోగ యువత ఉసురు పోసుకుని, ఇప్పుడేమో నియామక పత్రాలు ఇస్తుంటే సహించలేక అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తుంటే, తట్టుకోలేక ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని మల్లు రవి మండిపడ్డారు.