kumaram bheem asifabad- మహాధర్నాను జయప్రదం చేయండి
ABN , Publish Date - Jul 27 , 2025 | 11:06 PM
కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదు సోమవారం ఆదివాసీ సంఘాల అధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు కుమ్రం భీం కోరారు.మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సిర్పూర్(యు), జూలై 27 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదు సోమవారం ఆదివాసీ సంఘాల అధ్వర్యంలో నిర్వహిస్తున్న మహా ధర్నాను జయప్రదం చేయాలని తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు కుమ్రం భీం కోరారు.మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహారాష్ట్రలోని తాడోబా-ఆందారి టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌ను అనుసంధానం చేస్తూ కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 339 గ్రామల్లో టైగర్ కన్జర్వెషన్ కారిడార్‌ను ఏర్పాటు చేస్తు ప్రభుత్వం జీవో 49 జారీ చేసిందన్నారు. దీంతో జిల్లాలోని ఆయా గ్రామల ఆదివాసీలకు తీవ్ర నష్టం జరుతుందని చెప్పారు. ఆదివాసీలు ఆడవిని నమ్మి జీవనం కొనసాగిస్తున్నామన్నారు. టైగర్ కన్జర్వెషన్ కారిడార్ జీవో 49ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. దీనిలో భాగంగానే కలెక్టరేట్ ఎదుట మహాధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. ఆధిక సంఖ్యంలో హాజరై విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆత్రం భగవంత్‌రావు, తుడుం దెబ్బ నాయకులు మడావి నగేష్, గేడం మారుతి, లచ్చన్న,సిడం సుభాష్ తదితరులు పాల్గొన్నారు.