వారోత్సవాలను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Sep 09 , 2025 | 11:04 PM
ఈ నెల 11 నుంచి 17 వరకు జరిగే రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజ యవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పేర్కొ న్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నవాబులకు వ్యతి రేకంగా జరిగిందన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి) : ఈ నెల 11 నుంచి 17 వరకు జరిగే రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను విజ యవంతం చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పేర్కొ న్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరు ల సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటం భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం నవాబులకు వ్యతి రేకంగా జరిగిందన్నారు. ఈ పోరాటం ఎంతో గొప్పదన్నారు. గ్రామస్థా యి నుంచి పట్టణ, మండల కేంద్రాల్లో సాయుధ పోరాట వారోత్సవాల ను నిర్వహిస్తూ సాయుధ పోరాట చరిత్రను అమర వీరుల త్యాగాల ను సదస్సుల్లో సమాజానికి తెలిసే విధంగా నాయకులు కృషి చేయాల న్నారు. ముగింపు సంభ ఈ నెల 17న హైద్రాబాద్‌లోని రావి నారాయ ణరెడ్డి ఆడిటోరియంలో జరుగుతుందని, ఈ ముగింపు సభకు ప్రజా సంఘాల నాయకులు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొనాలన్నారు. ఈ సమావేశంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జోగుల మల్లయ్య, ఇప్పకాయల లింగయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు కలీందర్‌ఆలీఖాన్, లిం గం రవి, నాయకులు పౌలు, పోచన్న, శంకరయ్య, మ హేందర్‌రెడ్డి, సాంబయ్య, రామన్న, మొండి, నర్సయ్య,రాయమల్లు పాల్గొన్నారు.