ఉత్సవాలను విజయవంతం చేయాలి
ABN , Publish Date - Nov 07 , 2025 | 12:16 AM
సీపీఐ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా డిసెంబరు 20వ తేదీన ఖమ్మం జిల్లాలో నిర్వహించే ముగింపు ఉత్స వాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు.
సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి
దేవరకొండ, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): సీపీఐ ఏర్పడి వందేళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న ఉత్సవాల్లో భాగంగా డిసెంబరు 20వ తేదీన ఖమ్మం జిల్లాలో నిర్వహించే ముగింపు ఉత్స వాలను విజయవంతం చేయాలని ఆ పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డి పిలుపునిచ్చారు. నల్లగొండ జిల్లా దేవరకొండ పట్టణ ంలోని పల్లా పర్వత్‌రెడ్డి భవన్‌లో గురువారం జరిగిన సమావేశంలో మాట్లాడారు. పార్టీ వందేళ్ల ఉత్సవాలు కాన్పూరులో గతేడాది డిసెంబరు 26వ తేదీన ప్రారంభమైనట్లు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉత్సవాలు నిర్వహించినట్లు వివరించారు. ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కమ్యూనిస్టులు మరింతగా బలపడాలని కోరారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పల్లా నర్సింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరిరావు, పల్లా దేవేందర్‌రెడ్డి, మైనొద్దిన్, తూం బుచ్చిరెడ్డి, వెంకటరమణ, సుదర్శన్‌రెడ్డి, వెంకటేశ్వరరెడ్డి, వెంకటయ్య, జయరాములు, ఆంజనేయులు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.