Theft at Brilliant Engineering College: ఇంజనీరింగ్ కాలేజీలో భారీ చోరీ
ABN , Publish Date - Oct 11 , 2025 | 03:13 AM
అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలోని బీరువా తాళా...
బీరువా బద్దలు కొట్టి రూ.1.7 కోట్ల నగదు అపహరణ
సీసీ ఫుటేజీ తాలూకు హార్డ్ డిస్క్ ఎత్తుకెళ్లిన దొంగలు
బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఘటన
అబ్దుల్లాపూర్‌మెట్, అక్టోబరు 10(ఆంధ్రజ్యోతి): అబ్దుల్లాపూర్‌మెట్‌లోని బ్రిలియంట్ ఇంజనీరింగ్ కళాశాలలో గురువారం అర్ధరాత్రి భారీ చోరీ జరిగింది. అడ్మినిస్ట్రేషన్ కార్యాలయంలోని బీరువా తాళాలు పగులకొట్టి అందులో ఉన్న రూ.1.7 కోట్లను దొంగలు ఎత్తుకెళ్లారు. ఘటనాస్థలిలో రెండు స్కూృడ్రైవర్లు కనిపించాయి. వాటితోనే బీరువా తాళాలు పగులగొట్టి ఉంటారని భావిస్తున్నారు. తెలివిగా వ్యవహరించిన దొంగలు.. సీసీ ఫుటేజీ దొరక్కుండా ఉండేందుకు హార్డ్‌డి్‌స్కలను కూడా తమ వెంట పట్టుకెళ్లిపోయారు. గురువారం సాయంత్రం కాలేజీకి తాళాలు వేసి.. శుక్రవారం ఉదయం వచ్చిన సిబ్బంది బీరువా తాళాలు తెరిచి ఉండటాన్ని చూసి కళాశాల యాజమాన్యానికి సమాచారమిచ్చారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫీజులను ఎప్పటికప్పుడు బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేస్తూ వస్తున్నా.. ఈ పనిని పర్యవేక్షిస్తున్న యాజమాన్యంలోని కీలక వ్యక్తి కొన్నాళ్లుగా జ్వరంతో బాధపడుతుంటంతో ఫీజు రూపంలో వచ్చిన డబ్బునంతా కాలేజీలోని బీరువాలోనే దాస్తున్నట్లు తెలిసింది. ఈ సంగతి గుర్తెరిగిన వ్యక్తులే ఈ చోరీకి పాల్పడి ఉంటారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ చైర్మన్, కల్వకుర్తి ఎమ్మెల్యే నారాయణరెడ్డి కళాశాలను సందర్శించి వివరాలు తెలుసుకుని పోలీసులతో మాటాడారు. కళాశాల ప్రిన్సిపల్ వీరన్న ఫిర్యాదుతో ఘటనపై కేసు నమోదైంది.