Asaduddin Owaisi: జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మజ్లిస్ మద్దతు
ABN , Publish Date - Sep 08 , 2025 | 04:16 AM
ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి, జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మజ్లిస్ తన మద్దతు ప్రకటించింది.
హైదరాబాద్, సెప్టెంబరు 7 (ఆంధ్రజ్యోతి): ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి, జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి మజ్లిస్ తన మద్దతు ప్రకటించింది. సీఎం రేవంత్‌రెడ్డి మజ్లిస్ చీఫ్ అసదుద్దీన్ ఒవైసీకి ఫోన్ చేసి జాతీయ ప్రయోజనాల దృష్ట్యా జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరిన నేపథ్యంలో.. ఆ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుందని తెలిపింది. ప్రస్తుత పరిస్థితుల్లో జస్టిస్ సుదర్శన్ రెడ్డికి మద్దతు ఇవ్వడమే సమంజసమని భావిస్తున్నట్లు ఒవైసీ పేర్కొన్నారు. జస్టిస్ సుదర్శన్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలిపినట్లు ‘ఎక్స్’ వేదికగా వెల్లడించారు.