Mahesh Kumar Goud: కాంగ్రెస్‌పై మోదీ కుట్ర
ABN , Publish Date - Nov 20 , 2025 | 05:33 AM
కాంగ్రెస్‌తో పాటు నెహ్రూ కుటుంబానికి సంబంధించిన అనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు...
వారి చెప్పు చేతుల్లో సీబీఐ, ఈడీ, ఈసీ: మహేశ్‌కుమార్ గౌడ్
అచ్చంపేట, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రె్‌సతో పాటు నెహ్రూ కుటుంబానికి సంబంధించిన అనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కుట్రలు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా బుధవారం నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలోని ఆమె విగ్రహానికి ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి ఆయన పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ గరీబీ హటావో నినాదంతో సీలింగ్ యాక్ట్‌ను తీసుకొచ్చి భూస్వాముల చెర నుంచి భూములను విడిపించి లక్షలాది ఎకరాలను సామాన్యులకు పంచిన ఘనత ఇందిరాగాంధీదే అన్నారు. ఈడీ, సీబీఐ, ఎలక్షన్ కమిషన్లను తమ చెప్పు చేతులో ఉంచుకొని, రాష్ట్రాల్లో ఓటు చోరీతో బీజేపీ అధికారంలోకి వస్తోందని ఆరోపించారు. ఇటీవల బిహార్ ఎన్నికల్లో అదే జరిగిందన్నారు. అనంతరం ముస్లిం మైనారిటీ కమ్యూనిటీ భవన నిర్మాణానికి రూ.50 లక్షల ప్రొసీడింగ్ పత్రాలను నాయకులకు అందించారు. అంతకుముందు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శించుకొని అచ్చంపేటకు వచ్చిన మహేశ్ కుమార్ గౌడ్‌కు ఎమ్మెల్యే వంశీకృష్ణ, స్థానిక నేతలు ఘనంగా స్వాగతం పలికారు.