TPCC leader Mahesh Goud: బీసీ రిజర్వేషన్‌కు కట్టుబడి ఉన్నాం
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:13 AM
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అన్నది కాంగ్రెస్ పార్టీ వాగ్దానమని, దానికి కట్టుబడే ఉన్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు....
హైకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తాం.. అఖిల పక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తెస్తాం
18న బీసీ జేఏసీ బంద్‌కు మద్దతు: మహేశ్‌గౌడ్
టీపీసీసీ చీఫ్‌ను కలిసిన బీసీ జేఏసీ ప్రతినిధులు
హైదరాబాద్/హైదరాబాద్ సిటీ/పంజాగుట్ట, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అన్నది కాంగ్రెస్ పార్టీ వాగ్దానమని, దానికి కట్టుబడే ఉన్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్పష్టం చేశారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హైకోర్టులో మరోసారి బలమైన వాదనలు వినిపిస్తామని, బీసీ రిజర్వేషన్ సాధిస్తామనే నమ్మకం తమకు ఉందని పేర్కొన్నారు. గాంధీభవన్‌లో గురువారం మహే్‌షగౌడ్‌ను బీసీ సంఘాల జేఏసీ ప్రతినిధులు ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివా్‌సగౌడ్, దాసు సురేష్, రాజారామ్‌యాదవ్ తదితరులు కలిశారు. ఈ నెల 18న తలపెట్టిన బంద్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు. ఈ సంద్భంగా మహేశ్‌గౌడ్ మాట్లాడుతూ బీసీ సంఘాల జేఏసీ బంద్‌కు కాంగ్రెస్ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. బీసీ రిజర్వేషన్‌కు అసెంబ్లీలో మద్దతు ఇచ్చి, బయటకొచ్చి మోకాలొడ్డుతున్న వారికి కనువిప్పు కలగాలన్నారు. అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళతామని, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేపడతామని, ఇందుకు సంబంధించిన కార్యచరణను త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు. బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని ప్రధాని మోదీని అడిగేందుకు బీజేపీ తెలంగాణ ఎంపీలు ఎందుకు జంకుతున్నారని ప్రశ్నించారు. కాగా, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌కుమార్ యాదవ్‌కు మద్దతు ఇవ్వాలని సీపీఎం నేతలను మహేశ్‌గౌడ్ కోరారు. ఈ అంశంపై 20న రాష్ట్ర కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని సీపీఎం నాయకులు వివరించినట్లు తెలిసింది.
బంద్ సెగ ఢిల్లీకి తాకాలి: బీసీ నేతలు
18న చేపట్టనున్న రాష్ట్ర బంద్ సెగ ఢిల్లీకి తాకాలని బీసీ జేఏసీ చైర్మన్ ఆర్.కృష్ణయ్య, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బీసీ సంఘాల నేతలతో కలిసి వారు మాట్లాడారు. 42 శాతం రిజర్వేషన్లు సాధించేవరకు పోరాటం ఆగదని, బీసీలంతా ఏకమై బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్లను వ్యతిరేకించే వారిని రాజకీయ శత్రువులుగా ప్రకటిస్తామని అన్నారు. కాగా, బీసీలకు 42శాతం రిజర్వేషన్ దక్కాల్సిందేనని, ఇందుకోసం ఎక్కడి వరకైనా కొట్లాడుతానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు తెలిపారు. కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్‌రెడ్డి అగ్రకులాలకు చెందిన వారైనా బీసీల అభ్యున్నతి కోసం పని చేస్తున్నారని కొనియాడారు. ఫతేమైదాన్ క్లబ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రధాని మోదీకి బీసీలపై చిత్తశుద్ధి ఉంటే వెంటనే 42శాతం రిజర్వేషన్ కల్పించేందుకు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. 18న చేప్టనున్న రాష్ట్ర బంద్‌కు హైదరాబాద్‌లోని వ్యాపారస్తులు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, బీసీ రిజర్వేషన్ల విషయంలో సర్కారు తప్పటడుగులు వేస్తోందని, ఆ పార్టీ డ్రామాలు ఫలించలేదని బీఆర్‌ఎస్ నేతలు తలసాని శ్రీనివా్‌సయాదవ్, వి.శ్రీనివా్‌సగౌడ్ ఆరోపించారు. 18న బీసీ జేఏసీ చేపట్టిన బంద్‌లో బీఆర్‌ఎస్ పాల్గొంటుందని, అదేవిధంగా తెలంగాణలోని ప్రతి బీసీ బిడ్డ బంద్‌ను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు.
బంద్‌కు మావోయిస్టు పార్టీ మద్దతు
ఏటూరునాగారం/రాంనగర్:బీసీ జేఏసీ తలపెట్టిన తెలంగాణ రాష్ట్ర బంద్‌నువిజయవంతం చేయాలని మావోయిస్టు పార్టీరాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు.పార్లమెంట్‌లో చట్టం ద్వారా ఈ సమస్య పరిష్కారం లభిస్తుందని పేర్కొంటూ,అన్ని పార్టీలు, సంఘాలు, విద్యార్థులు, ప్రజాస్వామికవాదులు,మేధావులు ఏకమై బీజేపీ తీరును నిరసి స్తూ ప్రజాందోళన చేపట్టాలని కోరారు.బీసీ బంద్‌కు మద్దతు ప్రకటిస్తున్నట్లు టీఎస్ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు.