పల్లెలకు మహర్దశ....
ABN , Publish Date - Dec 23 , 2025 | 11:35 PM
గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసి, సర్పంచ్‌లు కూ డా కొలువు దీరినందున ఇక పల్లెలకు మహర్దశ పట్ట నుంది.
-కొత్త సర్పంచ్‌లపై కోటి ఆశలు
-’’ప్రత్యేక’’ పాలనలో పల్లెలు అస్తవ్యస్తం
-ప్రజలకు కరువైన జవాబుదారీ తనం
-సమస్యలు వినేవారు లేక ప్రజల అవస్థలు
-గ్రామ పంచాయతీల్లో కుంటుపడ్డ అభివృద్ధి
మంచిర్యాల, డిసెంబరు 23 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ముగిసి, సర్పంచ్‌లు కూ డా కొలువు దీరినందున ఇక పల్లెలకు మహర్దశ పట్ట నుంది. ఇంతకాలం ప్రత్యేకాధికారుల పాలనలో అస్థవ్య స్తమైన పల్లెల స్థితిగతులు కొత్త పాలక వర్గాల ఎన్నికతో తిరిగి గాడిన పడనున్నాయి. 2024 ఫిబ్రవరిలో పంచా యతీల పాలక వర్గాల పదవీ కాలం ముగిసింది. అప్ప టి నుంచి దాదాపు 20 నెలల తరువాత పంచాయతీ ఎ న్నికలకు మోక్షం లభించింది. పాలక వర్గాలు లేని కార ణంగా సుదీర్ఘకాలం పల్లెల్లో అభివృద్ధి కుంటుపడిందనే ఆరోపణలు ఉన్నాయి. పంచాయతీల వారీగా జిల్లా వ్యా ప్తంగా ప్రత్యేక అధికారులను ఇన్‌చార్జీలుగా నియమించి నప్పటికీ, వారు రెగ్యులర్ విధుల్లో బిజీగా ఉండి, పల్లెల పై పెద్దగా దృష్టి సారించలేక పోయారు. దీంతో ఆలనా పాలన కరువై గ్రామాల్లో దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
కుంటుపడ్డ అభివృద్ధి..
ప్రత్యేకాధికారుల పాలనలో జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. గతే డాది ఫిబ్రవరిలో గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం ముగియడంతో ప్రత్యేకాధికారుల పాలన ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర కాలంపాటు జవాబుదారీ తనం లేక ప్రజలు నానా అవస్థలు పడ్డారు. గ్రామ పం చాయతీల్లో కనీసం పారిశుధ్య పరిరక్షణ కూడా చేపట్ట డం లేదంటే అతిశయోక్తికాదు. డ్రైనేజీల్లో నెలల తరబడి పూడిక తీయకపోవడంతో వీధులన్నీ తీవ్ర దుర్గంధం వెదజల్లేవి. పిచ్చి మొక్కల తొలగింపు, క్లోరినేషన్ పను లు సైతం అంతంత మాత్రమే చేపట్టినట్లు ప్రజలు వా పోతున్నారు. గత సంవత్సరం గ్రామాల్లో సర్పంచులు, వార్డు మెంబర్ల పదవీకాలం ముగిసిన తరువాత అసెం బ్లీ, పార్లమెంట్ ఎన్నికలతోపాటు రోజువారీ కార్యకలా పాల్లో అధికారులు బిజీ అయ్యారు. తమ దైనందిన వి ధులు నిర్వహించేందుకే వారికి సమయం దొరకలేదు. పైగా పంచాయతీల బాధ్యతలు అధనంగా అప్పగించ డంతో పూర్తిస్థాయిలో న్యాయం చేయలేకపోయారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పల్లెల్లో నెలకొన్న సమస్యలపై ప్రజలు సంబంధిత అధికారులతో ఏకరువు పెట్టినా ఫలితం లేకుండా పోయింది.
నిధుల కొరతతో ఇబ్బందులు...
ఓ వైపు పాలక వర్గాలు లేకపోవడం, మరోవైపు ప్ర భుత్వం నుంచి సకాలంలో నిధులు విడుదల కాకపోవ డంతో గ్రామ పంచాయతీల్లో సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. అత్యవసర పనులు చేపట్టేందుకు కూడా సరిపడా నిధులు అందుబాటులో లేవు. దీంతో పంచా యతీ కార్యదర్శులు సొంతంగా నిధులు సేకరించి, అత్య వసర పనులు చేయించడంతో ప్రజలు కొంతమేర ఊపి రి పీల్చుకున్నారు. నెలల తరబడి కార్యదర్శులు అభివృద్ధి పనులు చేపట్టేందుకు జేబుల్లో నుంచి డబ్బులు వెచ్చిం చడంతో అప్పులు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రజల సమస్యలు తీర్చేందుకు కొన్ని చోట్ల కార్యదర్శులు ఇబ్బందులు పడక తప్పలేదు. ఎలాగోలా ముందుండి పంచాయతీల్లో ప్రజల కనీస అవసరాలను తీర్చగలిగారు.
కొత్త పాలకవర్గాలపైనే ఆశలు...
గ్రామ పంచాయతీల్లో దాదాపు 20 నెలల తరువాత కొత్త పాలక వర్గాలు ఏర్పాటు కావడంతో ప్రజలు వాటి పై కోటి ఆశలు పెట్టుకున్నారు. ఇంతకాలం పల్లెల్లో ఎక్క డవేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైన అభివృద్ధి ఇకమీదట గాడిన పడుతుందనే భావనలో ప్రజలు ఉన్నారు. ప్రజల ఆశయాలకు అను గుణంగానే మొన్న ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు మెంబ ర్లలో అనేక మంది యువత ఉండటం కలిసి వచ్చే అంశంగా చెప్పవచ్చును. కొత్త తరం ప్రజా పాలనలోకి రావడంతో గ్రామస్థులు సైతం హర్షం వ్యక్తం చేస్తు న్నారు. కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులు కూడా అభివృద్ధికి బాటలు వేసే అవకాశాలు అధికంగా ఉన్నాయి. 70 శాతం మేర అధికార కాంగ్రెస్ పార్టీకి చెం దిన సర్పంచ్‌లే ఉండటం, స్వతంత్రులు కూడా అధిక సంఖ్యలో త్వరలో ఆ పార్టీ కండువాలే కప్పుకోనున్నం దున గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయి. అధికార పార్టీ మద్దతు ఉంటే గ్రామాల్లో కనీ స అవసరాలైన రోడ్లు, డ్రైనేజీల నిర్మాణంతోపాటు ఇత రత్రా సౌకర్యాల కల్పన కోసం నియోజక వర్గాల ఎమ్మె ల్యేల సహకారంతో సకాలంలో నిధులు విడుదల అవకా శం ఉంది. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల ఎమ్మెల్యేలు కొక్కిరాల ప్రేం సాగర్‌రావు, గడ్డం వివేకానంద, గడ్డం వినోద్‌తోపాటు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో అవసరం మేరకు నిధులు విడుదలై గ్రామాలు అభివృద్ధి బాటలో పయనించే అవకాశాలు అధికంగా ఉన్నాయి.