Share News

kumaram bheem asifabad- రహదారులకు మహర్దశ

ABN , Publish Date - Nov 09 , 2025 | 10:47 PM

జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతా లకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రజలకు ఇబ్బందులు తొలగించేందుకు జిల్లా యంత్రాంగంతో పాటు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలో 30 రహదారులకు 140.66 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి.

kumaram bheem asifabad- రహదారులకు మహర్దశ
హ్యామ్‌ పథకం కింద ఎంపికైన బలాన్‌పూర్‌ రోడ్డు

- గ్రామాల ప్రజలకు తీరనున్న కష్టాలు

ఆసిపాబాద్‌రూరల్‌, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణ ప్రాంతా లకు మెరుగైన రోడ్డు సౌకర్యం కల్పించేందుకు ప్రజలకు ఇబ్బందులు తొలగించేందుకు జిల్లా యంత్రాంగంతో పాటు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలో 30 రహదారులకు 140.66 కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ప్రభుత్వం హ్యామ్‌(హైబ్రిడ్‌ యాన్యునిటీ మోడ్‌) పథకం కింద ఫేజ్‌ 1లో రోడ్ల నిర్మాణానికి చర్యలు చేపట్టింది. రోడ్ల నిర్మాణంలో భాగంగా త్వరలో టెండర్ల ప్రక్రియను ప్రారంబించనున్నారు.

మొదటి విడతలో..

జిల్లాలో మొదటి విడతలో 30 రోడ్లను మంజూరు చేయగా 140 కిలోమీటర్ల వరకు రహదారుల నిర్మాణం చేసేందుకు చర్యలు చేపట్టింది. ఆసిఫాబాద్‌ మండలం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గోవింద్‌పూర్‌, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఈదులవాడ, పీఆర్‌ రోడ్డు నుంచి వట్టివాడు ప్రాజెక్టు, వట్టివాగు ప్రాజెక్టు రోడ్డు నుంచి కౌటగూడ, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పర్సనంబాల, కెరమెరి మండలంలోని సావర్‌ఖేడ, కేలి కె నుంచి బోలపటార్‌, అనార్‌పల్లి నుంచి కరంజివాడ వరకు రోడ్లు నిర్మించనున్నారు. వాంకిడి మండలం జాముల్దరి, కోమటిగూడ, మోకాసిగూడ, మార్కగూడ, జైనూరు మండలంలోని జామ్ని, పవర్‌గూడ, సిర్పూర్‌(యూ) మండలంలోని మహగాం, దేవుడుపల్లి, లింగాపూర్‌ మండలంలో రామునాయక్‌ తండా నుంచి ఎల్లాపటార్‌, ఆలీగూడ నుంచి పిక్లాతండా, కాంచన్‌పల్లి, చింతలమానేపల్లి గుడ్లబోరి నుంచి బాబాపూర్‌ వరకు పనులు చేపట్టనున్నారు. కౌటాల మండలంలోని రన్‌వెల్లి, గుడ్లబోరి నుంచిబాబాపూర్‌, కాగజ్‌నగర్‌ మండలం ఆర్‌ఆండ్‌బీ రోడ్డు నుంచి కొత్త సార్‌సాల, ఆర్‌ఆండ్‌బీ రోడ్డు నుంచి వంజరి, బెజ్జూర్‌ మండలం జడ్పీ రోడ్డు నుంచి ముంజంపల్లి వరకు పనులు కొనసాగనున్నాయి. పెంచికల్‌పేట మండలం ఎలుకపల్లి నుండి ఎల్లూరు, దహెగాం మండలంలోని పీపీరావు కాలనీ నుండి సుర్జాపూర్‌ సిర్పూర్‌(టి) మండలం శివపూర్‌ వరకు రోడ్డు మంజూరు అయ్యాయి.

Updated Date - Nov 09 , 2025 | 10:47 PM