Share News

రహదారులకు మహర్దశ

ABN , Publish Date - May 31 , 2025 | 12:46 AM

మునుగోడు నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న గ్రామీణ ప్రాంత రోడ్డుకు మహర్దశ కలగనుంది.

 రహదారులకు మహర్దశ
బీటీరోడ్డుగా మారనున్న ఎలుగలగూడెం రోడ్డు

రహదారులకు మహర్దశ

డబుల్‌ రోడ్లుగా మారనున్న గ్రామీణ రోడ్లు

మునుగోడు నియోజకవర్గానికి రూ.163.85 కోట్లు మంజూరు

హర్షం వ్యక్తం చేస్తున్న ప్రజలు

(ఆంధ్రజ్యోతి,మునుగోడు రూరల్‌)

మునుగోడు నియోజకవర్గంలో అస్తవ్యస్తంగా ఉన్న గ్రామీణ ప్రాంత రోడ్డుకు మహర్దశ కలగనుంది. రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. మునుగోడు నియోజకవర్గంలో గుంతలు పడి కంకర తేలిన రోడ్లు మరమ్మతులకు నోచుకోనున్నాయి. గ్రామీణ ప్రాంత రోడ్లకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కృషితో రూ.164.85 కోట్ల నిధులు మంజూరయ్యాయి. నియోజకవర్గంలో గ్రామీణ ప్రాంతాల రోడ్లకు నిధులు మంజూరు కావడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మారుతున్న కాలానికి అనుగుణంగా రోజురోజుకు పెరుగుతున్న వాహనాల సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో రహదారులపై వాహనాల రద్దీ పెరిగింది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో రహదారులను 3.75 మీటర్ల నుంచి 5.5 మీటర్ల వరకు వెడల్పు పెంచాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంతరెడ్డి, మంత్రి సీతక్క దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి సూచనతో మొదటగా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో 3.75 మీటర్ల నుంచి 5.5 మీటర్ల వరకు వెడల్పు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మునుగోడు నియోజకవర్గంలోనీ 43 రోడ్లకు పంచాయతీరాజ్‌ గ్రామీణ అభివృద్ధి శాఖ సీఆర్‌ఆర్‌ 2024-25 నిధుల నుంచి రూ.163.85 లక్షలు మంజూరయ్యాయి. దీంతో టెండర్లు పిలిచి త్వరలో పంచాయతీరాజ్‌ అధికారులు పనులు ప్రారంభించనున్నారు.

గ్రామాల వారీగా రోడ్ల వెడల్పు

మునుగోడు మండలంలో పులిపలుపుల నుం చి బీరెల్లిగూడెం వరకు రూ. 3.35కోట్లు నిధులు మంజూరయ్యాయి. ఊకోండి నుంచి తాళ్లవెల్లం ల వరకు రూ.2.40 కోట్లు, పులిపలుపుల నుంచి ఊకోండి అడ్డరోడ్డు వరకు రూ. 4.70 కోట్లు, కల్వలపల్లి నుంచి కాశవారిగూడెం వరకు రూ.6.50 కోట్లు, ఆర్‌అండ్‌బీ మెయిన రోడ్డు నుంచి రత్తుపల్లి గ్రామం వరకు రూ.60లక్షలు, ఆర్‌అండ్‌బీ మెయిన రోడ్డు నుంచి గంగోరిగూడెం వరకు రూ.2.80 కోట్లు, వెల్మకన్నె నుంచి కల్వకుంట్ల వరకు రూ. 5 కోట్లు, కచలాపురం నుంచి వయా సింగారం నేరటోనీగూడెం రూ. 5కోట్లు, ఆర్‌అండ్‌బీ మెయిన రోడ్డు నుంచి గుండ్లోరిగూడెం వరకు రూ.2.20కోట్లు, ఆర్‌బీ రోడ్డు నుంచి కొరటికల్‌ రూ.80లక్షలు, చొల్లేడు నుంచి బోడంగిపర్తి వరకు రూ.7 కోట్లు మంజూరయ్యాయి.

నాంపల్లి మండలంలో...

కేతేపల్లి నుంచి తిరుమలగిరి వరకు రూ.3.20కోట్లు, కొండమల్లేపల్లి నుంచి బండ తిమ్మాపురం రూ.2.70 కోట్లు, అంతంపేట నుంచి గట్టుప్పల్‌ వరకు రూ.6.30 కోట్లు, బట్లపల్లి నుంచి వట్టిపల్లి వరకు రూ.2.50 కోట్లు, నాంపల్లి మండలంలోని చిట్టెంపహాడ్‌ నుంచి తిరుమలగిరి వరకు రూ.6 కోట్లు, మునుగోడు మండలంలోని పలివెల - సర్వేలు రోడ్డు నుంచి కోతులారం గ్రామంలోకి రూ.3.70కోట్లు, చలిమెడ నుంచి బొత్తళ్లగూడెం రూ.1.75 కోట్లు, కిష్టాపురం రోడ్డు నుంచి ఎలగలగూడెం వరకు రూ.4.50 కోట్లు, చండూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి దుబ్బకాల్వ రోడ్డు వరకు రూ.85లక్షలు, చండూరు ఆర్‌అండ్‌బీ రోడ్డు వయా బుడగ జంగాలకాలనీ లక్ష్మీదేవిగూడెం వరకు రూ. 1.50 కోట్లు, కచలాపురం - కిష్టాపురం చిన్నకాపర్తి రూ.6.50 కోట్లు, ఓల్డ్‌ కల్వకుంట్ల నుంచి కొంపెల్లి- కొండపురం రోడ్డు వయా వెంకటేశ్వరనగర్‌ రూ.3 కోట్లు, మెయిన రోడ్డు నుంచి సోలిపురం వరకు రూ.3.85కోట్లు మంజూరయ్యాయి.

మర్రిగూడ మండలంలో...

సరంపేట నుంచి శివన్నగూడెం వరకు రూ.1.80 కోట్లు, చండూరు మండలం తిమ్మారెడ్డిగూడెం నుంచి తుమ్మలపల్లి వరకు రూ.3.90 కోట్లు, చౌటుప్పల్‌ మండలం తూప్రానపేట్‌ - కాట్రేవు నుంచి ఎల్లంబాయి వరకు రూ. 2.15 కోట్లు, డి.నాగారం నుంచి పీపల్‌పహాడ్‌ అల్లాపూర్‌ రోడ్డు వయా మహా విష్ణు టెంపుల్‌ వరకు రూ.4 కోట్లు మంజూరయ్యాయి.

అల్లాపూర్‌ తుంబాయి తండా రోడ్డు నుంచి సరళ మైసమ్మ టెంపుల్‌ వరకు రూ.8కోట్లు, సింగరాయ చెరువు నుంచి తమ్మ డోనీ బావి రూ.5.70 కోట్లు, పెద్దకొండురు నుంచి సప్పిడివారిగూడెం రూ.5.20 కోట్లు, చిన్న కొండూరు రోడ్డు జూబ్లకపల్లి నుంచి మసీదుగూడెం వయా తోకేహెల్క రూ.3.90 కోట్లు, పంతంగి విలేజ్‌ నుంచి శనిగలగుట్ట వరకు రూ. 3.50కోట్లు మంజూరయ్యాయి.

చండూరు మండలంలో

చండూరు మెయిన రోడ్డు నుంచి జోగిగూ డెం వరకు రూ.1.70కోట్లు, పుల్లెంల నుంచి బోడంగిపర్తి వరకు రూ. 6.20కోట్లు, శిర్దేపల్లి నుంచి తాస్కానిగూడెం వరకు రూ.3.85 కో ట్లు, లక్కినేనిగూడెం నుంచి చొప్పరివారిగూ డెం వరకు రూ.2.70 కోట్లు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పడమటితాళ్ల వరకు రూ.3.90 కోట్లు, మెయిన రోడ్డు నుంచి దుబ్బగూడం వయా ఉడతలపల్లి రూ.1.45 కోట్లు, కొరటికల్‌ నుం చి శిర్దేపల్లి వరకు రూ.7.80 కోట్లు, తిమ్మారెడ్డిగూడెం నుంచి మల్లగుట్ట వరకు రూ.2.75 కో ట్లు, పుల్లెంల నుంచి గొల్లగూడెం వరకు రూ. 4.10 కోట్లు గట్లమల్లేపల్లి నుంచి తుమ్మల ప ల్లి వరకు రూ.4.55కోట్లు మంజూరయ్యాయి.

Updated Date - May 31 , 2025 | 12:46 AM