kumaram bheem asifabad- 4న టోంకినికి మహా పాదయాత్ర
ABN , Publish Date - Oct 30 , 2025 | 10:14 PM
కాగజ్‌నగర్ పట్టణం నుంచి సిర్పూర్(టి) మండలం టోంకిని సిద్ధిహనుమాన్ ఆలయం వరకు భక్తులు నవంబరు 4న 24వ మహాపాదయాత్రకు చేపట్టను న్నారు. కార్తీక మాసంలో ఆలయంలో ఏటా జాతరతో పాటు కాగజ్‌నగర్ పట్టణం నుంచి మహాపాదయాత్ర నిర్వహించడం అనవాయితీగా వస్తోంది.
- ఏర్పాట్లు చేస్తున్న ఆలయ కమిటీ సభ్యులు
- కార్తీకమాసంలో ఏటా నిర్వహణ
సిర్పూర్(టి), అక్టోబరు 30 (ఆంధ్రజ్యోతి): కాగజ్‌నగర్ పట్టణం నుంచి సిర్పూర్(టి) మండలం టోంకిని సిద్ధిహనుమాన్ ఆలయం వరకు భక్తులు నవంబరు 4న 24వ మహాపాదయాత్రకు చేపట్టను న్నారు. కార్తీక మాసంలో ఆలయంలో ఏటా జాతరతో పాటు కాగజ్‌నగర్ పట్టణం నుంచి మహాపాదయాత్ర నిర్వహించడం అనవాయితీగా వస్తోంది. ఇందుకు గానూ ఆలయ కమిటీ ఆధ్వర్యం లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నట్లు ఆలయ అర్చకుడు, కమిటీ సభ్యుడు మారుతి తెలిపారు. మండలంలోని టోంకిని గ్రామంలోని శ్రీ సిద్ధి హను మాన్ ఆలయంలోని స్వామి వారికి దర్శించుకుని ముడుపులు కడితే కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. దీంతో భక్తులు ఏటా ఆలయానికి పాదయాత్రగా వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. భక్తులు కోరుకున్న మొక్కులు తీరుతాయనే విశ్వా సంతో పాదయాత్రగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.
- మహారాష్ట్రలోని పలు గ్రామాల నుంచి..
సిర్పూర్(టి), కాగజ్‌నగర్, కౌటాల, బెజ్జూరు, ద హెగాం, రెబ్బెన, బెల్లంపల్లి, ఆసిఫాబాద్ మండలాల తో పాటు మహారాష్ట్రలోని పోడ్సా, అన్నూర్, అంత ర్‌గాం, గోండ్ పిప్రి గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అలయానికి చేరుకుని ఆలయ సమీపం లోని పెన్‌గంగాలో స్నానం ఆచరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. కార్తీక మాసంలో ప్రత్యే కంగా ఇక్కడ నుండే హనుమాన్ మాలధారణ చేయడంతో పాటు హనుమాన్ భక్తు లు ఆలయంలోనే ఉండి ప్రత్యేక పూజలు చేస్తారు. పాదయాత్రగా వచ్చే భక్తులకు ఆలయంలో ప్రత్యేక అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తారు. దీంతో ఆ రోజు మండల కేంద్రంలో పండగ వాతావరణం నెలకొం టుంది. కాగజ్‌నగర్ పట్టణంలోని హనుమాన్ ఆలయం నుంచి ప్రారంభమై పాదయాత్రగా వచ్చే భక్తులకు పాలు, పండ్లు, ఫలహారాలు అందజేస్తారు. మహాపాద య్రాతలో పాల్గొనే భక్తులకు ఆలయ కమిటీతో పాటు సిర్పూర్ (టి), కాగజ్‌నగర్, కౌటాల, తదితర ప్రాంతాలలోని వ్యాపారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, స్వచ్ఛంద సేవా సంస్థల ఆధ్వ ర్యంలో తాగునీరు.పాలు, పండ్లు, ఫలహారాల పంపి ణీకి రహదారి మధ్యలో ఏర్పాట్లు చేస్తున్నారు. సిర్పూర్(టి) మండలంలోని వెంపల్లి గ్రామం నుంచి వేంపల్లి రైల్వే గేటు, అటవీ ప్రాంతంలోని భీమన్న ఆలయం, పెద్దబండ గ్రామ సమీపంలో, మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాల యం, పెట్రోల్ పంపు, బెస్తకాలనీ, మేషన్ కాలనీ, ఎస్సీ కాలనీ, బస్టాండు, డౌనల్ ఏరియా, మధ్య వాగు ప్రాంతాలతో పాటు దారి పొడవున భక్తులకు పాలు, పండ్లు, తాగునీరు, అల్పాహారం పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.