Kaleshwaram Project: మద్రాస్ ఐఐటీ జేవీకే కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ బాధ్యత!
ABN , Publish Date - Oct 28 , 2025 | 04:11 AM
కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్థరణకు డిజైన్లతో పాటు సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను అందించే బాధ్యతను మద్రాసు..
ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం
హైదరాబాద్, అక్టోబరు 27(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్థరణకు డిజైన్లతో పాటు సమగ్ర పునరుద్ధరణ ప్రణాళికను అందించే బాధ్యతను మద్రాసు ఐఐటీతో ఒప్పందం చేసుకున్న జాయింట్ వెంచర్‌కే అప్పగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లు సిద్ధం చేసే పనిని ఎన్‌ఐటీ లేదా ఐఐటీలతో ఒప్పందం చేసుకున్న సంస్థలకే అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్దేశించింది. కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ కోసం ప్రతిష్టాత్మక సంస్థల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ)ను కోరుతూ నోటీసు ఇవ్వగా... ఐదు సంస్థలు టెక్నికల్ బిడ్లు వేశాయి. ఇందులో ఆర్వీ అసోసియేట్స్, ఐఐటీ మద్రాస్, స్పెయిన్‌కు చెందిన సంస్థ కలిపి జాయింట్ వెంచర్‌గా బిడ్‌లు వేశాయి. ఆ తర్వాత నిప్పాన్ సంస్థ కూడా బిడ్ దాఖలు చేసింది. వీటిని షార్ట్‌లిస్ట్ చేసి, సోమవారం ప్రభుత్వానికి అందించగా ఐఐటీ లేదా ఎన్‌ఐటీతో ఒప్పందం చే సుకున్న సంస్థలనే పరిశీలించాలని స్పష్టం చేసింది. దాంతో మద్రాస్ ఐఐటీ జేవీ చేతికే పని లభించే అవకాశం ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీల పునరుద్థరణ విషయంలో జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్డీఎ్‌సఏ) నిపుణుల కమిటీ తుది నివేదికలో చేసిన సిఫారసులకు అనుగుణంగా డిజైన్లు అందించాలని ప్రభుత్వం సూచించింది.