Share News

Madhu Sudhanachari: వ్యవస్థలను భ్రష్ఠు పట్టించింది కాంగ్రెస్సే

ABN , Publish Date - Aug 07 , 2025 | 04:28 AM

బీఆర్‌ఎ్‌సకు వ్యవస్థలపై నమ్మకం లేదంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వ్యవస్థల గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రె్‌సకు లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి

Madhu Sudhanachari: వ్యవస్థలను భ్రష్ఠు పట్టించింది కాంగ్రెస్సే

  • శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి

హైదరాబాద్‌, ఆగస్టు 6 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎ్‌సకు వ్యవస్థలపై నమ్మకం లేదంటూ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని, వ్యవస్థల గురించి మాట్లాడే నైతిక అర్హత కాంగ్రె్‌సకు లేదని శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి పేర్కొన్నారు. దేశంలో అన్ని వ్యవస్థలను భ్రష్ఠు పట్టించిందే కాంగ్రెస్‌ అని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ నేత దేవీప్రసాద్‌తో కలిసి బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో వ్యవస్థలపై సంపూర్ణ విశ్వాసం ఉన్న ఏకైక పార్టీ బీఆర్‌ఎస్‌ అని, కేసీఆర్‌ పాలనలో వ్యవస్థల గౌరవాన్ని ఎంతో పెంచారన్నారు. కాళేశ్వరం కమిషన్‌ను ప్రభావితం చేసేవిధంగా కాంగ్రెస్‌ వ్యవహరిస్తోందని, 665 పేజీల నివేదికలో తమకు నచ్చిన అంశాలను మాత్రమే లీక్‌చేసి బీఆర్‌ఎ్‌సపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Updated Date - Aug 07 , 2025 | 04:28 AM