Madabhushi Family Safe: నేపాల్‌లో మాడభూషి కుటుంబం క్షేమం
ABN , Publish Date - Sep 12 , 2025 | 04:16 AM
నేపాల్‌లో తీర్థయాత్రలకు వెళ్లిన కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్‌తో పాటు ఆయన కుటుంబ...
హైదరాబాద్ పర్యాటకులు కూడా సురక్షితం
హైదరాబాద్ సిటీ, సెప్టెంబరు 11(ఆంధ్రజ్యోతి) : నేపాల్‌లో తీర్థయాత్రలకు వెళ్లిన కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులు క్షేమంగా ఉన్నారు. ఈ నెల 27న మాడభూషి కుటుంబం, మిత్రులు కలిసి 27మంది నేపాల్ వెళ్లారు. అయితే, అక్కడ హింస తలెత్తడంతో పశుపతినాథ్ దర్శనం అనంతరం కాఠ్మాండూలోని దారాహి హోటల్‌లో వారంతా ఆర్మీ రక్షణలో తలదాచుకున్నారు. ఏపీ మంత్రి నారా లోకేశ్ తనకు ఫోన్ చేసి క్షేమ సమాచారం తెలుసుకున్నారని మాడభూషి శ్రీధర్ తెలిపారు. గురువారం ఉదయానికే కాఠ్మండూలో పరిస్థితులు సద్దుమణగడంతో తీర్థయాత్రను కొనసాగించాలని తామంతా నిర్ణయించుకున్నామని తెలిపారు. మరో రెండు రోజుల్లో భారత్‌కు వస్తామని తెలిపారు. కాగా, నేపాల్ పర్యటనకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన మరో రెండు బృందాలు కూడా సురక్షితంగా ఉన్నాయి. అయితే, అల్లరి మూకలు ఓ హోటల్‌ను తగలబెట్టడంతో అందులో ఉన్న ఒక బృందానికి చెందిన వస్తువులన్నీ కాలిపోయాయని తెలిసింది.