Share News

Lovebirds Arrested: ప్రేమజంట డ్రగ్స్‌ దందా!

ABN , Publish Date - Dec 25 , 2025 | 05:10 AM

ఉద్యోగం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి వచ్చి.. హైదరాబాద్‌లోని కొండపూర్‌లో కో లివింగ్‌లో ఉంటూ డ్రగ్స్‌ దందా నడుపుతున్న ప్రేమ జంటను....

Lovebirds Arrested: ప్రేమజంట డ్రగ్స్‌ దందా!

  • కాకినాడ నుంచి వచ్చి కొండాపూర్‌లో కో లివింగ్‌.. డార్క్‌వెబ్‌లో డ్రగ్స్‌ కొనుగోలు

  • క్రిప్టోలో చెల్లింపులు.. కొరియర్‌ సర్వీస్‌ ద్వారా కస్టమర్లకు సరఫరా

  • ఆటకట్టించిన హెచ్‌ న్యూ పోలీసులు

  • డెలివరీ బాయ్‌ సహా.. నలుగురి అరెస్టు

  • రూ.3.12 లక్షల విలువైన డ్రగ్స్‌ స్వాధీనం

  • కొత్త సంవత్సరం వేడుకల్లో డ్రగ్స్‌ వాడితే చర్యలు: సైబరాబాద్‌ సీపీ సుధీర్‌బాబు

హైదరాబాద్‌ సిటీ/చిక్కడపల్లి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): ఉద్యోగం కోసం ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ నుంచి వచ్చి.. హైదరాబాద్‌లోని కొండపూర్‌లో కో లివింగ్‌లో ఉంటూ డ్రగ్స్‌ దందా నడుపుతున్న ప్రేమ జంటను హైదరాబాద్‌ నార్కోటిక్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ వింగ్‌ (హెచ్‌ న్యూ) పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 22 గ్రాముల ఓజీ కుష్‌, 5 గ్రాముల ఎండీఎంఏ, 5.57 గ్రాముల ఎక్స్‌టసీ పిల్స్‌, 6 ఎల్‌ఎ్‌సడీ బ్లాట్స్‌, రూ.50 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌ విలువ రూ.3.12 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. ఈ కేసు వివరాలను డీసీపీ గైక్వాడ్‌ వైభవ్‌ రఘునాథ్‌ బుధవారం వెల్లడించారు. కాకినాడకు చెందిన ఉమ్మిడి ఇమ్మాన్యుయేల్‌ కొండాపూర్‌లో ఉంటూ ఈవెంట్‌ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అదే పట్టణానికి చెందిన సుిస్మితాదేవి అనే యువతి ఇటీవల నగరానికి వచ్చి ఓ సాఫ్ట్‌వేర్‌ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. వీరిద్దరూ కలిసి కొండాపూర్‌లో కో లివింగ్‌లో (సహ జీవనం) ఉన్నారు. అప్పటికే డ్రగ్స్‌కు అలవాటుపడిన ఇమ్మాన్యుయేల్‌కు జీతం సరిపోకపోవడంతో సుష్మితతోకలిసి డ్రగ్స్‌ దందా ప్రారంభించాడు.

డార్క్‌వెబ్‌లో ఆర్డర్‌.. క్రిప్టోలో చెల్లింపులు..

వీరు ఓజీ కుష్‌, ఎండీఎంఏ, ఎక్స్‌టసీ పిల్స్‌, ఎల్‌ఎ్‌సడీ బ్లాట్స్‌ వంటి డ్రగ్స్‌ను డార్క్‌వెబ్‌లో కొనుగోలు చేసి, కొరియర్‌ సర్వీ్‌సల ద్వారా కస్టమర్లకు సరఫరా చేసేవారు. కొరియర్‌ బాయ్‌ సాయికుమార్‌ వీరికి సహకరించేవాడు. ఆర్డర్‌ చేసిన డ్రగ్స్‌కు చెల్లింపులను ఆన్‌లైన్‌లో క్రిప్టోకరెన్సీ ద్వారా చేసేవారు. కాగా, చిక్కిడపల్లిలో లక్మీకాంత్‌ అయ్యప్ప అనే యువకుడు డ్రగ్స్‌ తీసుకుంటున్నట్లు హెచ్‌ న్యూ పోలీసులకు సమాచారం అందటంతో అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా సుస్మిత, ఇమ్మాన్యుయేల్‌ దందా బయటపడింది. దీంతో పోలీసులు ఇమ్మాన్యుయేల్‌, సుిస్మిత, సాయికుమార్‌, లక్ష్మీకాంత్‌లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. చిక్కడపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

డ్రగ్స్‌ వినియోగంపై ఉక్కుపాదం: సీపీ సుధీర్‌బాబు

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా డ్రగ్స్‌ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాచకొండ సీపీ సుధీర్‌బాబు హెచ్చరించారు. నూతన సంవత్సర వేడుకలపై బుధవారం కమిషనరేట్‌లో పబ్‌లు, బార్లు, రెస్టారెంట్లు, ఫామ్‌హౌ్‌సలు, వైన్‌షాపులు, ఈవెంట్‌ ఆర్గనైజింగ్‌ సంస్థల నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీ మాట్లాడుతూ.. ప్రజలు బాధ్యతాయుతంగా న్యూ ఇయర్‌ వేడుకలు జరుపుకోవాలని కోరారు. ఔట్‌డోర్‌ కార్యక్రమాలు జరిగే చోట డీజే లు, బాణాసంచాకు అనుమతి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీలు నారాయణరెడ్డి, అనూరాధ, సీహెచ్‌ శ్రీధర్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Dec 25 , 2025 | 05:10 AM