రాజకీయ సిత్రాలెన్నో..
ABN , Publish Date - Dec 28 , 2025 | 10:51 PM
రాజకీ యంగా ఎంతో అభివృద్ధి సాధించిన జిల్లాగా మంచిర్యా ల విరాజిల్లుతోంది. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బె ల్లంపల్లి ఎమ్మెల్యేలైన కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వేకానంద, గడ్డం వినోద్ అత్యంత సీనియారిటీగల నేత లు. వారి కనుసన్నల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది.
-ఏడాది కాలంలో పార్టీలపై తీవ్ర ప్రభావం
-పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా
రసవత్తరంగా దేవాపూర్ సిమెంట్ కంపెనీ ఎన్నికలు
బీజేపీ జిల్లా అధ్యక్షుడి నియామకం
మంచిర్యాల, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): రాజకీ యంగా ఎంతో అభివృద్ధి సాధించిన జిల్లాగా మంచిర్యా ల విరాజిల్లుతోంది. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బె ల్లంపల్లి ఎమ్మెల్యేలైన కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వేకానంద, గడ్డం వినోద్ అత్యంత సీనియారిటీగల నేత లు. వారి కనుసన్నల్లో జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. ఎమ్మెల్యేలతో పాటు ద్వితీ య శ్రేణి నాయకులు కూడా పరిణతి సాధించడం శుభ సూచకంగా కనిపిస్తోంది. ఏడాది కాలంలో అనేక రాజకీ య పరిణామాలు చోటు చేసుకోగా పంచాయతీ ఎన్ని కల నిర్వహణ, డీసీసీ అధ్యక్షుల నియామకం, బీజేపీ జి ల్లా అధ్యక్షుడి నియామకం జరిగింది. పంచాయతీ ఎ న్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురు వేసింది. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలోని మొత్తం 306 పంచాయతీలకు గాను 186 స్థానాలను కైవసం చేసుకొని కాంగ్రెస్ తన ఆధి పత్యాన్ని కొనసాగించింది. ఇక బీఆర్‌ఎస్, బీజేపీలు ద్వితీ య, తృతీయ స్థానాలతో సరిపెట్టుకున్నాయి. పంచా యతీ ఎన్ని కల్లో బీఆర్‌ఎస్‌కు 51 స్థానాలు రాగా, బీజేపీ తొమ్మిది స్థానాలలో పాగా వేయడం ద్వారా తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో బోణీ కొట్టింది. అలాగే ఓరియం ట్ సిమెంట్ కంపెనీలో ఎన్నికలు సైతం ఎంతో రసవత్తరంగా సాగాయి.
దోబూచులాడిన మంత్రి పదవి....
అసెంబ్లీ ఎన్నికలు జరిగి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడ్డ కొత్తలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన మంత్రి పదవుల కేటాయింపు ఉంటుందని తెలంగాణ ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. దీంతో పదవి రేసులో ఉన్న జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి ఎ మ్మెల్యేలు కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, గడ్డం వివేకానంద, గడ్డం వినోద్ మధ్య మంత్రి పదవి దోబూచులాడింది. చివరి వరకు ఎవరి ప్రయత్నాలు వారు చేశారు. ఢిల్లీ స్థాయిలో సైతం అలుపెరగని ప్రయత్నాలు చేశారు. ముఖ్యంగా ప్రేంసాగర్‌రావు, వివేకానంద మంత్రి పదవి కోసం పోటీ పడ్డారు. అయితే చివరికి చెన్నూరు ఎమ్మె ల్యే గడ్డం వివేకానంద వైపే అధిష్టానం మొగ్గు చూప గా, మంత్రి పదవి ఆయన్నే వరించింది. రాష్ట్ర గనులు, కార్మికశాఖ మంత్రిగా గడ్డం వివేకానంద పదవీ బాధ్య తలు స్వీకరించారు. వివేకానందకు మంత్రి పదవి ఇవ్వ డంతో ఆ పదవిని ఆశించి భంగపడ్డ ప్రేంసాగర్‌రావు కు కేబినెట్ హోదాతో కూడిన రాష్ట్ర పౌర సరఫరాలశా ఖ చైర్మన్ పదవిని రేవంత్ ప్రభుత్వం అప్పగించింది. మూడో విడత విస్తరణలోనైనా తనకు అవకాశం వ స్తుందనే గట్టి నమ్మకంతో ప్రేంసాగర్‌రావు ఉన్నారు.
డీసీసీ అధ్యక్షుడి నియామకం...
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మొదట జి ల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవులను భర్తీ చేస్తారనే ప్రచారం జరిగింది. ఎట్టకేలకు డీసీసీ పదవుల నియా మకం కూడా పూర్తికాగా, చెన్నూరు నియోజకవర్గానికి చెందిన పిన్నింటి రఘునాథ్‌రెడ్డికి జిల్లా పార్టీ పగ్గాలు అప్పగించారు. జిల్లాలోని మంచిర్యాల, చెన్నూరు, బెల్లం పల్లి అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో డీసీసీ పదవి కోసం 29 మంది ఆశావహులు దరఖస్తు చేసుకోగా, అ ధిష్టానం పిన్నింటి వైపే మొగ్గు చూపింది. డీసీసీ అధ్య క్షుడు రఘునాథ్‌రెడ్డి సౌమ్యుడు కావడంతోపాటు అంద రినీ కలుపుకొని వెళ్లగలిగే నేర్పరితనం ఉంది. అలాగే జిల్లాలోని మూడు నియోజక వర్గాల ఎమ్మెల్యేలు కాం గ్రెస్ పార్టీకి చెందిన వారే కావడం రఘునాథ్‌రెడ్డికి కలి సి వచ్చే అంశం. అలాగే జిల్లాలోని జన్నారం మండ లా నికి ప్రాతినిథ్యం వహిస్తున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు సైతం కాంగ్రెస్ పార్టీకే కాగా అంతకు ముందు రెండు పర్యాయాలు డీసీసీ అధ్యక్షురాలిగా మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేంసాగర్‌రావు సతీమణి కొక్కిరాల సురేఖ పదవీ బాధ్యతలు నిర్వహించారు.
పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా...
ఇటీవల నిర్వహించిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగుర వేసింది. మూడు నియో జక వర్గాల్లోనూ కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు ముం దంజలో దూసుకుపోయారు. పంచాయతీ ఎన్నికల్లో మూడు విడతల్లోనూ కాంగ్రెస్ ప్రథమ స్థానంలో నిల వగా, బీఆర్‌ఎస్, బీజేపీలు ద్వితీయ, తృతీయ స్థానాలకు పరిమితం అయ్యాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికా రంలో ఉండగా, పంచాయతీ ఎన్నికల్లో తమ ఆధిపత్యా న్ని చాటుకోవడానికి కాంగ్రెస్‌తోపాటు ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్, బీజీపీ గట్టి ప్రయత్నమే చేశాయి. అత్యధిక సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకోవడం ద్వారా తమ ఉనికిని చాటుకునేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌లు శక్తివం చన లేకుండా కృషి చేశాయి. చివరకు ప్రజలు అధికార పార్టీ మద్దతు తెలిపిన అభ్యర్థులకే సర్పంచ్, ఉప సర్పం చ్‌లుగా పట్టం కట్టారు. పంచాయతీ ఎన్నికల్లో విజయ బావుటా ఎగుర వేసిన కాంగ్రెస్ పార్టీ రాబోయే ము న్సిపల్, పరిషత్ ఎన్నికల్లోనూ అదే ఒరవడి కొనసాగిం చాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
బీజేపీ జిల్లా అధ్యక్షుడి నియామకం
ఇక ఈ యేడాది బీజేపీ జిల్లా అధ్యక్షుడి నియామకం కూడా జరిగింది. 2025 ఫిబ్రవరి 4వ తేదీన బీజేపీ జి ల్లా అధ్యక్షుడిగా చెన్నూర్‌కు చెందిన నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ను ఆ పార్టీ అధిష్టానం నియమించింది. అం తకు ముందు రఘునాథ్ వెరవల్లి జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వర్థించగా ప్రస్థుతం నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్ కొనసాగుతున్నారు.
ఉత్కంఠ రేపిన దేవాపూర్ ఎన్నికలు
ఈ ఏడాది ఆగస్టు 19న జరిగిన దేవాపూర్ ఆదాని సిమెంటు కంపెనీ గుర్తింపు సంఘం ఎన్నికలు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపాయి. మంత్రి గడ్డం వివేక్‌వెంకటస్వామి, బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్‌లు కలిసి స్థాని క నాయకుడు పుస్కూరి విక్రమ్‌రావును ఓరియంట్ గుర్తింపు ఎన్నికల్లో అభ్యర్ధిగా బలపరిచారు. మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావు సోదరుడు కొక్కి రాల సత్యపాల్‌రావును సిమెంట్ కంపెనీ ఎన్నికలో బరి లో నిలిపాడు. మంత్రి వివేక్‌వెంకటస్వామి వర్సెస్ ఎమ్మె ల్యే ప్రేమ్‌సాగర్‌రావు వర్గాల మధ్య జరిగిన ఆధిపత్య పోరులో మంచిర్యాల ఎమ్మెల్యే పై చేయి సాధించి తన తమ్ముడు సత్యపాల్‌రావును ఒంటి చేత్తో గెలిపించుకు న్నాడు. సొంత మండలంలో ప్రేమ్‌సాగర్‌రావు తన తి రుగులేని నాయకత్వాన్ని బలపర్చి విజయం సాధించా డు. ఆందోళనలు, నిరసనలు మధ్య జరిగిన సిమెంటు కంపెనీ ఎన్నికలు ఉత్కంఠ రేపాయి. రసవత్తరంగా జ రిగిన సిమెంటు కంపెనీ ఎన్నికల్లో సత్యపాల్‌రావు విజ యం సాధించడంతో ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.