Share News

లారీ యజమానుల రిలే దీక్ష

ABN , Publish Date - Jun 02 , 2025 | 11:22 PM

నస్పూర్‌ పట్టణంలో తీగల్‌పహాడ్‌ గోదాముల వద్ద న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కోల్‌ బెల్ట్‌ ఏరియా లారీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ యజమానుల ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరహార దీక్ష చేపట్టారు. సీసీఐ అధికారులు తమ సమస్యల పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం చేయ డం వల్లనే తమ ఆందోళన చేపట్టినట్లు యజమానులు తెలిపారు.

లారీ యజమానుల రిలే దీక్ష
దీక్షలో కూర్చున్న లారీ ఓనర్స్‌ అసోసియేషన్‌ యజమానులు

నస్పూర్‌, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి) : నస్పూర్‌ పట్టణంలో తీగల్‌పహాడ్‌ గోదాముల వద్ద న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కోల్‌ బెల్ట్‌ ఏరియా లారీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ యజమానుల ఆధ్వర్యంలో సోమవారం రిలే నిరహార దీక్ష చేపట్టారు. సీసీఐ అధికారులు తమ సమస్యల పరిష్కారం చూపకుండా నిర్లక్ష్యం చేయ డం వల్లనే తమ ఆందోళన చేపట్టినట్లు యజమానులు తెలిపారు. ఇతర రాష్ర్టాలకు చెంది న లారీలు తక్కువ అద్దెలకు తెప్పించి ఇక్కడి నుంచి లోడింగ్‌ చేపిస్తున్నారని ఆరోపిం చారు. సీసీఐ అధికారుల నిర్లక్ష్యం కారణంగా తాము ఉపాధిని కోల్పోయే పరిస్థితి ఏర్పడిం దన్నారు. దీంతో వందలాది మంది లారీ యజమానుల కుటుంబాలు వీదినపడే పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇప్పటికైన సీపీఐ అధికారులు స్పందించి తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ దీక్షలో కోల్‌బెల్ట్‌ ఏరియా లారీ ఓనర్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రెసిడెంట్‌ గుండా సురేశ్‌గౌడ్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ బాస్కర్ల సుమన్‌, ప్రదాన కార్యదర్శి రాందేని రమేశ్‌, జాయింట్‌ సెక్రటరీ అరికోల్ల రమేశ్‌, కల్చరర్‌ సెక్రటరీ గుడికం దుల తిరుపతి, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ దాసరి పవ న్‌, కోశాధికారి కట్కం ప్రశాంత్‌లతో పాటు పలువురు లారీ యజమానులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2025 | 11:22 PM