కేసుల పరిష్కారానికి లోక్ అదాలత్ దోహదం
ABN , Publish Date - Nov 15 , 2025 | 11:01 PM
రాజీమార్గమే రాజామార్గమని జిల్లా ప్రధాన న్యా యాధికారి డి.రమాకాంత్ అన్నారు.
- జిల్లా ప్రధాన న్యాయాధికారి రమాకాంత్
కందనూలు, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : రాజీమార్గమే రాజామార్గమని జిల్లా ప్రధాన న్యా యాధికారి డి.రమాకాంత్ అన్నారు. ్ట్రహైకోర్టు ఆదేశానుసారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివా రం లోక్ అదాలత్ నిర్వహించారు. లోక్ అదాల త్‌లో రాజీ చేసుకోదగిన అన్ని క్రిమినల్, చెక్‌బౌ న్స్, కుటుంబ తగాదాలు, మోటారువాహన యా క్సిడెంట్, భూవివాదం, బ్యాంకు తదితర కేసుల ను పరిష్కరించుకోవచ్చన్నారు. లీగల్ అవేర్నెస్ ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమంలో అనంత రం స్పెషల్ సెషన్స్ జడ్జి నసీమా సుల్తానా, ప్రి న్సిపాల్ జూనియర్ సివిల్ శృతిదూత, బార్‌అసో సియేషన్ అధ్యక్షుడు కాంతారావు, అడిషనల్ ఎస్పీ నోముల వెంకటేశ్వర్లు, డీఎస్పీ శ్రీనివాసు లు, ఆర్టీసీ మేనేజర్ యాదయ్య, స్టేష న్ ఫైర్‌ఆఫీసర్ కృష్ణమూర్తి, ఎంఈ వోభాస్కర్‌రెడ్డి, న్యాయవాదులు, మో టారు వెహికల్ ఇన్‌స్పెక్టర్ మహేష్, టీచర్లు, విద్యార్థినులు పాల్గొన్నారు.
ఫ కొల్లాపూర్ (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్ కోర్టుల ప్రాంగణంలో శని వారం నిర్వహించిన ప్రత్యేక లోక్ అ దాలత్‌లో మొత్తం 52 కేసులు రాజీమార్గం ద్వా రా, అపరాధ రుసుము విధించి పరిష్కరించా రు. బెంచీకి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా దమ్ము ఉప నిషధ్వాని, చైర్మన్ కం జూనియర్ సివిల్ న్యా యాఽధికారి, సభ్యులుగా కురుమూర్తి, న్యాయవా ది, మోహన్‌లాల్ న్యాయవాది వ్యవహరించా రు. ఏపీపీ శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్షు డు నాగరాజు, ప్రధాన కార్యదర్శి బాలస్వామి, న్యాయవాదులు భాస్కర్ రెడ్డి, శివారెడ్డి, రాజేష్, నళిని, పిరంగి గోవింద్, పోలీసు కోర్టు కానిస్టే బుళ్లు, న్యాయశాఖ సిబ్బంది హాజరయ్యారు.
ఫ ఊర్కొండ : కల్వకుర్తి మున్సిఫ్ కోర్టులో నిర్వహించిన లోక్ అదాలత్‌లో మండలంలోని బీఎన్‌ఎస్‌లో ఉన్న 6 క్రిమినల్ కేసులు, 10 ఈపీట్టి కేసులు, 11 డ్రంకెన్ డ్రైవ్ కేసులను లోక్ ఆదాలత్‌లో న్యాయాధికారి కావ్య సమక్షంలో రాజీ కుదిర్చినట్లు ఎస్‌ఐ కృష్ణదేవ తెలిపారు.