Share News

స్థానిక సమరానికి సై...

ABN , Publish Date - Jun 09 , 2025 | 11:05 PM

స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్న ద్ధం అవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు ఆదే శాలు జారీ చేసినట్లు సమాచారం. కాగా రాష్ట్ర ప్రభు త్వం స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిం చినా ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు సైతం సమాయత్తం అవుతున్నాయి.

స్థానిక సమరానికి సై...

సన్నద్ధమవుతున్న ప్రభుత్వం

రాజకీయ పార్టీల సమాయత్తం

బీసీ రిజర్వేషన్లపై స్పష్టత కరువు

మంచిర్యాల, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్న ద్ధం అవుతోంది. ఇప్పటికే ప్రభుత్వం అధికారులకు ఆదే శాలు జారీ చేసినట్లు సమాచారం. కాగా రాష్ట్ర ప్రభు త్వం స్థానిక సంస్థల ఎన్నికలను ఎప్పుడు నిర్వహిం చినా ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు సైతం సమాయత్తం అవుతున్నాయి. ఇటీవల మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్ల పరిధిలో డీలిమిటేషన్‌ ప్రక్రియ పూర్తి చేసిన ప్రభుత్వం దాన్ని అధికారికంగా ప్రకటిం చేందుకు నిర్ణయించింది. మున్సిపాలిటీల్లో వార్డుల పున ర్విభజన ప్రక్రియ దాదాపుగా పూర్తి కావడంతో స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించాలనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చినట్లు స్పష్టంగా తెలుస్తోంది. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియను ప్ర భుత్వం దాదాపుగా పూర్తి చేసింది. ఎన్నికల అధికారు లకు శిక్షణ కార్యక్రమాలు పూర్తి కాగా బ్యాలెట్‌ బాక్స్‌లు తదితర సామగ్రి కూడా జిల్లాలకు చేరుకుంది. ఈక్ర మంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతుందని వినిపిస్తోంది. అయితే మున్సిపల్‌ ఎన్నికలు జరిగినతర్వాతే పంచాయతీ ఎన్నికలను నిర్వహిస్తారని కూడా మరో వై పు చర్చలు జోరందుకున్నాయి. మొత్తంగా ఆప్రక్రియ లను పూర్తి చేసేందుకు అధికార యంత్రాంగం కూడా సిద్ధంగా ఉంది.

బీసీ రిజర్వేషన్లపై కానరాని స్పష్టత...

రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్‌, పంచాయతీ ఎన్నికలకు సిద్ధపడుతుండటంతో బీసీ రిజర్వేషన్ల సంగతి ఏంటని ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో బీ సీ కుల గనణ చేపట్టిన రేవంత్‌ సర్కార్‌ కేంద్ర ప్రభు త్వం ఆమెదం కోసం ప్రతిపాదనలను పంపింది. బీసీల కు 42శాతం రిజర్వేషన్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఖరా రు చేసింది. అయితే ప్రభుత్వం 42శాతం రిజర్వేషన్ల ను బీసీలకు ప్రతిపాధించినందున అది స్థానిక సంస్థ ల ఎన్నికలకు కూడా వర్తిస్తుందా.? అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. ప్రభుత్వాలు 42శాతం రిజర్వేషన్లు బీ సీలకు అమలు చేస్తున్నట్లు ప్రకటిస్తే అందుకు పంచా యతీలు, మున్సిపాలిటీల్లోను ఆశావహులు సన్నద్ధం కా వాల్సి ఉంటుంది. అయితే బీసీ రిజర్వేషన్లపై స్పష్టత ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్‌ సైతం వినిపిస్తోంది.

జిల్లాలో 306పంచాయతీలు..

మంచిర్యాల జిల్లాలో మున్సిపాలిటీల డీలిమిటేషన్‌ తర్వాత పంచాయతీల సంఖ్య 306కు పరిమితమైంది. గతంలో 311గ్రామ పంచాయతీలు ఉండగా 5 పంచా యతీలు హాజీపూర్‌ మండలం, వేంపల్లి, ముల్కల్ల, గు డిపేట, చందరనాపూర్‌, నర్సింగాపూర్‌, పంచాయతీల ను మంచిర్యాల మున్సిపల్‌ కార్పొరేషన్‌లో విలీనం చే సారు. దీంతో పంచాయతీల సంఖ్య 306కు ఫైనల్‌ అ య్యింది. అలాగే ఆయా పంచాయతీల పరిధిలో 101 క్ల స్టర్లుగా విభజించారు. జిల్లాలో మూడు విడతల్లో పం చాయతీ ఎన్నికలను నిర్వహించాలని ప్రతిపాదించిన ప్పటికీ రెండు విడతల్లోనే పూర్తి చేసేలా రాష్ట్ర ఎన్ని కల సంఘం చర్యలు చేపట్టినట్లు సమాచారం. జిల్లాలో ని 101క్లస్టర్లకు ఒక్కో క్లస్టర్‌ ఇద్దరు చొప్పున అధికారు లను నియమించి శిక్షణ అందజేశారు.

పంచాయితీలు, వార్డుల వివరాలు...

జిల్లాలో పంచాయతీలు-306,

వార్డులు.-2,680

ఓటర్లు-3,76,853

పోలింగ్‌ కేంద్రాలు-2,680

బ్యాలెట్‌ బాక్సులు-3,777

Updated Date - Jun 09 , 2025 | 11:05 PM