Share News

kumaram bheem asifabad-స్థానిక పాలన.. ప్రగతికి ఆలంబన

ABN , Publish Date - Oct 08 , 2025 | 10:21 PM

పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తేనే గ్రామ స్వరాజ్యం సిద్ధిసుందనేది నిజం. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రంలో 1994పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా జిల్లా ప్రాదేశిక, మండల ప్రాదేశిక నియోజక వర్గాలు ఏర్పడ్డాయి. అంతకుముందు గ్రామ సర్పంచ్‌లు మండల ప్రజా పరిషత్తులో, మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు జిల్లా ప్రజా పరిషత్తులో సభ్యులుగా ఉండే వారు.

kumaram bheem asifabad-స్థానిక పాలన.. ప్రగతికి ఆలంబన
లోగో

బెజ్జూరు, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): పల్లెలే దేశానికి పట్టుకొమ్మలు. పంచాయతీలను ఆర్థికంగా పరిపుష్టం చేస్తేనే గ్రామ స్వరాజ్యం సిద్ధిసుందనేది నిజం. ఈ మేరకు ఉమ్మడి రాష్ట్రంలో 1994పంచాయతీరాజ్‌ చట్టం ద్వారా జిల్లా ప్రాదేశిక, మండల ప్రాదేశిక నియోజక వర్గాలు ఏర్పడ్డాయి. అంతకుముందు గ్రామ సర్పంచ్‌లు మండల ప్రజా పరిషత్తులో, మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షులు జిల్లా ప్రజా పరిషత్తులో సభ్యులుగా ఉండే వారు. ప్రాదే శిక ఎన్నికలకు సమయం సమీపిస్తున్న నేపథ్యంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల ప్రాధాన్యంపై ‘ఆంధ్రజ్యోతి’ప్రత్యేక కథనం..

- సభ్యుల ఆమోదంతోనే..

మండల పరిషత్తు సమావేశాల్లో మెజారిటీ సభ్యుల ఆమోదంతోనే తీర్మానాలు పట్టాలె క్కుతాయి. ఎంపీటీసీ సభ్యుడు తన ప్రాదేశిక నియోజకవర్గంలోని గ్రామపంచా యతీల్లో శాశ్వత ఆహ్వానితుడు. పంచాయతీ సమావేశా లకు హాజరు కావచ్చు. ఓటు హక్కు మాత్రం ఉండదు. మండల పరిషత్తు అభివృద్ధి, సమీక్ష సమావే శాలకు హాజరై తన పరిదిలోని సమస్యలను ప్రస్తావిస్తూ, నిధుల మంజూరుకు కృషి చేయాలి. అభివృద్ధి పనుల్లో అక్రమాలను ఉన్నతిధాకారుల దృష్టికి తీసుకెళ్లవచ్చు. తన పరిధిలోని పాఠశాలలను సందర్శించి విద్యాప్రమా ణాల మెరుగుకు సూచనలు అందించవచ్చు. మండల పరిషత్తు నిధుల విషయంలో అధికారులను ప్రశ్నించ వచ్చు. అభివృద్ధి కార్య క్రమాల అమలు తీరును పరిశీ లించి సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లే అధికారం ఉంటుంది.

జడ్పీటీసీ సభ్యుల మద్దతు..

జిల్లా పరిషత్తు తీర్మానాల ఆమోదంలో మెజారిటీ జడ్పీటీసీ సభ్యుల మద్దతు తప్పనిసరి. తమ మండల పరిషత్తు సమావేశాలకు హాజరై అక్కడ పరిష్కారం పొందలేని సమస్యలు జడ్పీ సమావేశాల్లో ప్రస్తావించ వచ్చు. పనుల నిర్వహణలో లోపాలు, నిధుల దుర్విని యోగం లాంటివి జడ్పీ చైర్మెన్‌ లేదా సీఈవో దృస్టికి తీసు కెళ్లవచ్చు. జడ్పీ అజెండాలో సమస్యలను చేర్చే, తీర్మానాలను ప్రతిపాదించే అధికా రం ఉంటుంది. ముందస్తు నోటీసుతో జడ్పీ పరిపాలనకు సంబంధించిన అంశాలపై ప్రశ్నించవచ్చు. ఆర్థిక నివేదికను పరిశీలించి సూచనలు చేయయవచ్చు. జడ్పీ పాఠశాలలను సంద ర్శించి సూచనలు ఇవ్వవచ్చు. మండల, నియోజకవర్గ నీటి వినియోగ పరిరక్షణ కమిటీ సభ్యుడిగా నీటి పరి రక్షణకు చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది.

Updated Date - Oct 08 , 2025 | 10:21 PM