నిఘా నీడలో ’స్థానిక’ ఎన్నికలు....
ABN , Publish Date - Oct 06 , 2025 | 11:37 PM
స్థానిక సం స్థల ఎన్నికల్లో భాగంగా మొదటి విడుతలో నిర్వహించే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లను నిఘా నీడలో నిర్వహిం చేందుకు ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. ఎ న్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే విధానానికి చెక్ పె ట్టే చర్యలు తీసుకుంటున్నారు. వివిధ విభాగాలకు చెం దిన ప్రత్యేక బలగాలతో విస్తృత తనిఖీలు నిర్వహిం చడం ద్వారా నగదు, మద్యం, ఇతర ప్రలోభాలకు గురి చేసే వస్తువుల తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు.
-ఎంసీసీని పకడ్బంధీగా అమలు చేసే చర్యలు
-ప్రత్యేక బృందాలతో విస్తృత తనిఖీలు
-చెక్ పోస్టుల ఏర్పాటుతో జిల్లా కట్టుదిట్టం
-నగదు, మద్యం సరఫరా అరికట్టడమే లక్ష్యం
మంచిర్యాల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): స్థానిక సం స్థల ఎన్నికల్లో భాగంగా మొదటి విడుతలో నిర్వహించే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎలక్షన్లను నిఘా నీడలో నిర్వహిం చేందుకు ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. ఎ న్నికల్లో ఓటర్లను ప్రభావితం చేసే విధానానికి చెక్ పె ట్టే చర్యలు తీసుకుంటున్నారు. వివిధ విభాగాలకు చెం దిన ప్రత్యేక బలగాలతో విస్తృత తనిఖీలు నిర్వహిం చడం ద్వారా నగదు, మద్యం, ఇతర ప్రలోభాలకు గురి చేసే వస్తువుల తరలింపునకు అడ్డుకట్ట వేసేందుకు పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ప్రత్యేక బృందాలు ప్రధాన రహదారులు, కూడళ్ల వద్ద వాహనాల రాకపో కలపై నిఘా వేసి, తనిఖీలు ముమ్మరం చేశాయి. కట్టు దిట్టమైన చర్యల్లో భాగంగా జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులతో ఎప్ప టికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సంద ర్భం గా జిల్లా ఎన్నికల అధికారులకు అవసరమైన సూ చనలు, సలహాలు అందజేస్తున్నారు.
చెక్ పోస్టుల ఏర్పాటుతో కట్టుదిట్టం....
ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అరికట్టేందుకు ఎన్నికల కమిషన్ పకడ్బంధీ చర్యలు చేపడుతోంది. ము ఖ్యంగా జిల్లా సరిహద్దుల ద్వారా జిల్లాలోకి, అలాగే జి ల్లా నుంచి ఇతర జిల్లాలకు నగదు, మద్యం, దేశీ దారు, గుడుంబా, ఆయుధాలు, ఉచిత ప్రలోభాలకు సం బం ధించిన వస్తువులు తరలిపోకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇందులో భాగంగా జిల్లా బోర్డర్‌లలో ప్రత్యేక చెక్ పోస్టులను ఏర్పాటు చేసింది. వీటిలో ఒక అంతర్ రాష్ట్ర చెక్ పోస్ట్ ఉండగా, మరికొన్ని జిల్లా చెక్ పోస్టులు ఉన్నాయి. మహారాష్ట్రతో సరిహద్దు ప్రాంతం కలిగి ఉన్న జిల్లాలోని కోటపల్లి మండలంలో పారుపెల్లి ఎక్స్ రోడ్డు వద్ద అంతరాష్ట్ర చెక్‌పోస్టు ఏర్పాటు చేయగా, తాండూరు ఐబీ వద్ద, జన్నారంలోని ఇందన్‌పల్లి వద్ద అటవీశాఖ చెక్ పోస్టు, దండేపల్లి మండలం గూడెం, జైపూర్ మండలం ఇందారం వద్ద ప్రత్యేక చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఆయా చెక్ పోస్టుల్లో ఎస్‌ఎస్‌టీ స భ్యులుగా రెవెన్యూ, పోలీస్‌శాఖ, నీటిపారుదలశాఖ, వ్య వసాయ శాఖలకు చెందిన వివిధ కేడర్ల అధికారులు పని చేస్తారు. జిల్లాలోని ఇతర రాష్ట్రాలు, జిల్లాలను క లిపే మండలాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేసి నలు మూలలా కట్టుదిట్టం చేశారు.
నిఘా ముమ్మరం....
స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ (ఎంసీసీ)ని పకడ్బంధీగా అమలు చేయ డంలో భాగంగా రహదారులపై నిఘా ముమ్మరం చే సేందుకు ప్రత్యేకంగా స్టాటికల్ సర్వేయ్‌లెన్స్ టీమ్స్ (ఎస్‌ఎస్‌టీ), ఫైయింగ్ స్క్వాడ్ టీమ్స్ (ఎఫ్‌ఎస్‌టీ)ను ప్రత్యేకంగా ఏర్పాటు చేసింది. ఎస్‌ఎస్‌టీ బృందాలు జిల్లా ఎన్నికల అధికారి, పోలీస్‌శాఖ డిప్యూటీ కమిషనర్ పర్యవేక్షణలో పని చేస్తాయి. ఆయా టీమ్స్‌లో ఎగ్జిక్యూటి వ్ మెజిస్ట్రేట్, పోలీస్‌శాఖకు చెందిన ఎస్సై, ఏఎస్సై స్థా యి అధికారి, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన చెం దిన ఉద్యోగులు సభ్యులుగా ఉంటారు. ఎస్‌ఎస్‌టీ బృం దాలు సాధారణ తనిఖీలతోపాటు వివిధ ప్రాంతాల్లో సంఘ వ్యతిరేక శక్తుల కదలికలను కూడా పర్యవేక్షిస్తాయి. అలాగే తనిఖీల ప్రక్రియను వీడియో గ్రాఫ్ చేయడం ద్వారా పారదర్శకత అమలు చేస్తారు.
నగదు రవాణాపై ఆంక్షలు...
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో భాగంగా నగదు రవా ణాపై ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. ఎవరైనా రూ. 50వేల కంటే ఎక్కువ నగదు లేదా రూ. 10వేల కంటే విలువైన మాదక ద్రవ్యాలు, మద్యం, బహుమతి వస్తువులు, తదితర ఎన్నికల ప్రలోభాలుగా భావించే ఇతర వస్తువులు తరలించడం చట్ట విరుద్దం. తనిఖీల సమయంలో నగుదుతోపాటు పై వస్తువులు దొరికితే ఎస్‌ఎస్‌టీ సభ్యులు వాటిని స్వాధీనం చేసుకుంటారు. వాటికి సరియైన ఆధారాలు ఉంటే తిరిగి అందజేస్తారు. అలాగే వ్యాపారం నిమిత్తం బ్యాంకుల్లో డిపాజిట్ చేయ డానికి నగదు తీసుకు వెళ్లే పక్షలో సదరు వ్యక్తి పాన్ కార్డు, వ్యాపార ధృవీకరణ పత్రాలు, బ్యాంక్ పాస్ బుక్ వెంట ఉంచుకోవలసి ఉంటుంది. వైద్య చికిత్స కోసం నగదు తీసుకెళ్లాల్సి వస్తే అందుకు సంబంధించిన రుజు వును అధికారులకు సమర్పించాలి. వివాహ వేడుకల్లో భాగంగా నగదుకు సంబంధించిన వివాహ ఆహ్వాన ప త్రం, ఇతర ధృవీకరణ పత్రాలు వెంట ఉంచుకోవలసి ఉంటుంది.