Share News

పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి

ABN , Publish Date - Nov 04 , 2025 | 11:17 PM

రైతులు విధిగా త మ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జి ల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ జ్ఞానశే ఖర్‌ కోరారు.

పశువులకు గాలికుంటు టీకాలు వేయించాలి
పశువులకు టీకా వేస్తున్న జిల్లా పశువైద్యాధికారి జ్ఞానశేఖర్‌

- జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ జ్ఞానశేఖర్‌

కల్వకుర్తి/ వెల్దండ, నవంబరు4 (ఆంధ్రజ్యోతి) : రైతులు విధిగా త మ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలని జి ల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ జ్ఞానశే ఖర్‌ కోరారు. మంగళవారం కల్వకు ర్తి మండలపరిధిలోని జీడిపల్లి గ్రా మంలో పశువులకు గాలికుంటు టీకాలు వేశా రు. ఈ కార్యక్రమానికి స్టేట్‌ మానిటరింగ్‌ టీమ్‌ సభ్యుడు డాక్టర్‌ వెంకటయ్యగౌడ్‌తో కలిసి ఆయ న పశువులకు టీకాలు వేశారు. ఈ నెల 14వ తేదీ వరకు పశువులకు టీకాలు వేస్తారని, ఈ అవ కాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవా లని కోరారు. కార్యక్రమంలో ఏడీ డాక్టర్‌ భాస్క ర్‌రెడ్డి, మండల పశువైద్యాధికారి డాక్టర్‌ నాగరా జు, సిబ్బంది జేవీవో రాజు, ప్రణిత, ఆంజనేయు లు, బాలరాజు, పలువురు రైతులు పాల్గొన్నారు.

వెల్దండ మండలం చొక్కన్నపల్లి, గుండాల గ్రామాలలో నిర్వహించిన గాలికుంటు టీకాల పంపిణీని టీకాల రాష్ట్రస్థాయి పర్యవేక్షకుడు డాక్టర్‌ వెంకటయ్య పరిశీలించారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి జ్ఞానశేఖర్‌, విజయా డెయిరీ డీడీ సత్యనారాయణ, డాక్టర్‌ శ్యాంసుందర్‌, సిబ్బంది నరేష్‌రెడ్డి, తిర్పతయ్య, ఫణీందర్‌రెడ్డి, నర్సింహ, గోపాలమిత్రలు మొగులయ్య, సాయిబాబా, బీఎంసీయూ సూపర్‌వైజర్‌ కృష్ణ తదితరులు ఉన్నారు.

Updated Date - Nov 04 , 2025 | 11:17 PM