Share News

kumaram bheem asifabad- పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలి

ABN , Publish Date - Oct 15 , 2025 | 11:15 PM

జిల్లాలోని పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్‌ మండలం అంకుశాపూర్‌ గ్రామంలో బుధవారం పశువైద్య ఉప కేంద్రంలో పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు.

kumaram bheem asifabad- పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలి
పశువులకు టీకాలు వేస్తున్న కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే

ఆసిఫాబాద్‌రూరల్‌, అక్టోబరు 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పాడి రైతులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేయించాలని జిల్లా కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. ఆసిఫాబాద్‌ మండలం అంకుశాపూర్‌ గ్రామంలో బుధవారం పశువైద్య ఉప కేంద్రంలో పశువైద్య, పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి గాలికుంటు వ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ యజమానులు తమ పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా తప్పనిసరిగా వేయించాలని సూచించారు. పాడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కార్యక్రమం నిర్వహిస్తున్నాయని చెప్పా రు. ఈ సంవత్సరం అధిక వర్షాలు కురిసినందున పశువులు వ్యాధుల బారిన పడుతున్నాయని అన్నారు. ఈ సందర్భంగా యజమానులకు పశువులకు బలాన్ని అందించే మల్టీ మిక్స్‌ పౌడర్‌ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం జాతీయ పశువ్యాధుల నివారణ కార్యక్రమంకు సంబందించి గోడ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ సురేష్‌కుమార్‌, పశువైద్యాధికారి మురళీకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

కౌటాల, (ఆంధ్రజ్యోతి): కౌటాల మండలం తలోడి గ్రామంలో బుధవారం పశువైద్యాధికారి డాక్టర్‌ కె అంజలి ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకా వేశారు. ఈ సందర్భంగా నాలుగు నెలల పైబడిన పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది సందీప్‌, ఖదీర్‌, భిక్షపతి, ప్రకాష్‌, శోభన్‌, తదితరులు పాల్గొన్నారు.

పెంచికలపేట, (ఆంధ్రజ్యోతి): పెంచికలపేటలో బుధవారం పశువైద్యాధికారి రాకేష్‌ ఆధ్వర్యంలో పశువులకు గాలింపు వ్యాధి నివారణ టీకా కార్యక్రమం నిర్వహించారు. మూడు నుంచి 4 నెలల వయస్సు పైబడిన 142 పశువులకు, 99 గేదెలకు గాలి కుంటు నివారణ టీకాలు అందించినట్లు తెలిపారు. కార్యక్రమంలో రైతులు శంకర్‌, బాబు, అశోక్‌, తోగయ్య, డాక్టర్‌ రాకేష్‌, శివకుమార్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

దహెగాం, (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రంలో బుధవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేసినట్లు పశువైద్యాధికారి రమేశ్‌ తెలిపారు. 280 పశువులకు టీకాలు వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది నరేష్‌, హనుమయ్య, సురేష్‌, మల్లేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కెరమెరి, (ఆంధ్రజ్యోతి): మండలంలో పశువైద్యాధికారి డాక్టర్‌ సురేష్‌ ఆధ్వర్యంలో బుధవారం పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకా వేశారు. రైతులు పశువులకు తప్పని సరిగా టీకా వేయించాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది రాజు, సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్‌(టి), (ఆంద్రజ్యోతి): సిర్పూర్‌(టి) మండలంలో బుధవారం పశువై ద్యాధికారి డాక్టర్‌ విజయ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 15 , 2025 | 11:15 PM