పశువులకు టీకాలు వేయించాలి
ABN , Publish Date - Oct 18 , 2025 | 11:42 PM
ప శువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నిరో ధక టీకాలు టీకాలు వేయించాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి. జ్ఞానశేఖర్ రైతులకు సూచించారు.
- జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి. జ్ఞాన శేఖర్
చారకొండ, అక్టోబరు 18 (ఆంధ్రజ్యోతి) : ప శువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నిరో ధక టీకాలు టీకాలు వేయించాలని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ బి. జ్ఞానశేఖర్ రైతులకు సూచించారు. శనివారం మండల కేం ద్రంలో పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలను మండల పశువైద్యాధికారి డాక్టర్ శివకుమార్‌తో కలిసి ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రతీ రోజు ఉదయమే గ్రామాలకు వచ్చి పశు వులకు టీకాలు వేసే పశువైద్య సిబ్బందికి రైతు లు సహకరించాలని కోరారు. అన్నిరకాల పశువు లకు గాలికుంటు వ్యాధి నివారణకు సంబంధిం చిన టీకాలు వేస్తారని తెలిపారు. ఈ కార్యక్ర మం వచ్చే నెల 14వ తేదీ వరకు కొనసాగుతుందని అన్నారు. అనంతరం మండల కేంద్రంలో ని ప్రాథమిక పశువైద్య కేంద్రా న్ని సందర్శించి రికార్డులను పరిశీ లించారు. టీకాలు ఇచ్చిన పశవు ల వివరాలను భారత్ పశుధాన్ యాప్‌లో తప్పనిసరిగా ఆన్‌లైన్ చేయాలని పశువైద్యాధికారికి సూ చించారు.
అంతకుముందు మండలంలోని సిరసనగండ్ల సీతారామచంద్రస్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. కార్య క్రమంలో వెటర్నరీ లైవ్‌స్టాక్ ఆపీసర్ షేక్ మ దార్, వోఎస్ శివరాం, గోపాలమిత్ర గిరిబాబు యాదవ్, మల్లయ్య, రైతులు పాల్గొన్నారు.
ఫ ఊర్కొండ : పశువులకు గాలికుంటు నివారణ టీకాలు సద్వినియోగం చేసుకోవాలని పశుపోషకులను మండల పశువైద్యాధికారి డాక్ట ర్ రాజేష్‌కుమార్ కోరారు. శనివారం మండలం లోని తిమ్మన్నపల్లి గ్రామంలో పశువులకు గాలి కుంటు నివారణ టీకాలు వేశారు. ఆయన మా ట్లాడుతూ మండలంలోని పశువులకు గాలికుం టు నివారణ టీకాలు వేస్తున్నామని, ప్రతీ ప శువుకు వేయించాలని రైతులకు తెలిపారు.