kumaram bheem asifabad- ఒక్క క్లిక్‌తో పాఠాలు ప్రత్యక్షం
ABN , Publish Date - Aug 08 , 2025 | 11:28 PM
సాంకేతిక పరి జ్ఞానం విద్యారంగంలోను కొత్త విప్లవం తీసుకువస్తుం ది. పాఠశాలల్లో చెప్పే పాఠాలను అరచేతిలోని స్మార్ట్ ఫోన్‌లోనూ వినే అవ కాశం అందుబాటులోకి వచ్చింది. ఏదైనా కారణం చేత బడికి వెళ్లలేని పరిస్థితిలో కొందరు విద్యార్థులు పాఠాలను మిస్ అయినప్పుడు, అలాగే పాఠశాలలో చెప్పిన పాఠం అర్థం కానప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. ఇలాంటి విద్యార్థుల కోసం ‘దీక్ష’ యాప్‌ను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్‌ను ఓపెన్ చేసి ఒక్క క్లిక్ చేస్తే మనకు కావాల్సిన పాఠాలను వినొచ్చు
- అందుబాటులోకి డిజిటల్ పాఠ్యాంశాలు
వాంకిడి, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): సాంకేతిక పరి జ్ఞానం విద్యారంగంలోను కొత్త విప్లవం తీసుకువస్తుం ది. పాఠశాలల్లో చెప్పే పాఠాలను అరచేతిలోని స్మార్ట్ ఫోన్‌లోనూ వినే అవ కాశం అందుబాటులోకి వచ్చింది. ఏదైనా కారణం చేత బడికి వెళ్లలేని పరిస్థితిలో కొందరు విద్యార్థులు పాఠాలను మిస్ అయినప్పుడు, అలాగే పాఠశాలలో చెప్పిన పాఠం అర్థం కానప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. ఇలాంటి విద్యార్థుల కోసం ‘దీక్ష’ యాప్‌ను విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చింది. స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్‌ను ఓపెన్ చేసి ఒక్క క్లిక్ చేస్తే మనకు కావాల్సిన పాఠాలను వినొచ్చు. ఈ యాప్‌లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు పుస్తకంలోని పాఠ్యాంశాలన్నీ అందుబాటులో ఉంటాయి. పుస్తకంలోని క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే పాఠ్యాంశానికి సంబంధించిన వీడియోను చూడొచ్చు.
- పాఠశాలకు వెళ్లలేని వారికి..
ఏదైనా కారణం చేత పాఠశాలకు వెళ్లలేక ఉపాధ్యా యులు చేప్పే పాఠాలు మిస్ అయ్యే విద్యార్థుల బాధ లు అన్ని ఇన్నీ కావు. క్లాస్‌లకు వెళ్లలేక పోయినందున తోటి విద్యార్థులతో పోటీలో వెనుకబడి పోతామని అవేదన చెందుతుండడం పరిపాటి. అయితే ఇక మీదట ఇలాంటి బాధలు పడాల్సిన పనిలేదు. తోటి విద్యార్థులపై ఆధారపడాల్సిన అవసరం ఎంత మాత్రం లేదు. తమకు కావాల్సిన సబ్జెక్టులోని పాఠాలను ఎప్పు అంటే అప్పుడు నిపుణులైన ఉపాధ్యాయులు చెప్పే వీడియో క్లాస్‌ల ద్వారా వినవచ్చు. ఇందుకోసం విద్యా శాఖ దీక్ష అనే యాప్‌ను విద్యార్థులకోసం అందుబాటు లోకి తెచ్చింది. ఒకటి నుంచి పదవతరగతి వరకు పాఠ్యపుస్తకాల్లోని పాఠ్యాంశాలన్నీ యాప్‌లో పొందుపరి చింది. పలు భాషల్లో ఈ పాఠ్యాంశాలు వినే విధంగా దీన్ని రూపకల్పన చేశారు. పాఠ్యపుస్తకాల్లోని క్యూఆర్‌కో డ్‌ను స్కాన్ చేసి తమకు కావాల్సిన పాఠాలను ఈ దీక్ష యాప్ ద్వారా ఎన్నిసార్లు అయినా వినవచ్చు. విద్యార్థుల మానసిక స్థాయికి తగినట్లు దృశ్యరూ పకంగా బోధన సాగుతుంది. ఒక్క క్లిక్‌తో పాఠ్యాంశా లను విని ఆయా సబ్జెక్టుల్లో పూర్తి స్థాయిలో పట్టు సాధించవచ్చు. స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అర్థం కాని పాఠ్యాంశాన్ని చదివే వెసులు బాటు కల్పించారు. ఏమైనా సందేహాలున్నా యాప్ ద్వారా వీటిని నివృత్తి చేసుకోవచ్చు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్లలేనప్పుడు ఇంటి దగ్గర నుంచే ఈ పాఠాలన్నీ వినవచ్చు. తరగతి గదిలో తమ టీచర్ చెప్పిన పాఠం సరిగా అర్థం కాకున్నా ఇంటికి వెళ్లి దీక్ష యాప్ ద్వారా ఆ పాఠ్యాంశాన్ని ఒకటికి రెండుసార్లు విని పూర్తిగా తెలుసుకోవచ్చు. ఈ యాప్ విద్యార్థులతో పాటు ఉపాధ్యాయులకు ఉభయతారకంగా పనిచేసే విధంగా రూపొందించారు. ఇందులోని పాఠ్యాంశాలన్నీ సురక్షితులైన ఉపాధ్యాయులు సృజనాత్మకంగా బోధిం చారు. దీంతో ఇతర ఉపాధ్యాయులు కూడా వీటిని చూడడం ద్వారా మేలైన పద్ధతుల్లో బోధన చేయ డానికి ఉపయోకరంగా ఉంటుంది.
- డౌన్‌లోడ్ ఇలా..
స్టార్ట్ ఫోన్‌లోని ప్లేస్టోర్ లేదా ఐఓఎస్‌లోకి వెళ్లి ‘దీక్ష’ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసు కోవాలి. యాప్ లోకి వెళ్లి లాంగ్వేజ్‌తో పాటు ఇతర అడిగిన వివరాలన్నీ నమోదు చేయాలి. ఆ తర్వాత లాగిన్ అవ్వాలి. ఈ యాప్‌ను ఉపయోగించి డిజిటల్ టెక్ట్స్‌బుక్స్‌పై స్కాన్ చేస్తే డిజిటల్ పాఠం వస్తుంది. పాఠ్యపుస్తకం ప్రధాన పుటపై ఉన్న క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే స్మార్ట్ ఫోన్‌లో కోరుకున్న పాఠ్యాంశాన్ని పొందవచ్చు. నిపుణులైన ఉపాధ్యాయులు బోధించిన పాఠాలను ఎన్ని సార్లు అయినా వినవచ్చు.
యాప్‌ను సద్వినియోగం చేసుకోవాలి
- రాజేష్, ఉపాధ్యాయుడు
విద్యాశాఖ అందుబాటులోకి తీసుకువచ్చిన దీక్ష యాప్‌ను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. పాఠశాలకు వెళ్ల లేని విద్యార్థులకు ఈ యాప్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. క్లాస్‌లో టీచర్ బోధిం చిన సబ్జెక్టును తిరిగి స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్ ద్వారా తెలు సుకునే అవకాశం ఉంది. అర్థం కాని సబ్జెక్టును ఎన్ని సార్లు అయినా విని అర్థం చేసుకోవడానికి ఈ యాప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది.