విన్నపాలు వినవలె
ABN , Publish Date - May 13 , 2025 | 12:09 AM
ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారంవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెలువెత్తుతున్నాయి.
విన్నపాలు వినవలె
ప్రజావాణికి వెల్లువెత్తిన వినతులు
నల్లగొండ టౌన, మే 12 (ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కారం కోసం వారంవారం కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి వినతులు వెలువెత్తుతున్నాయి. పథకాల కోసం, ఇందిరమ్మ ఇళ్లు, తమ భూ సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు. జిల్లా నలుమూలల నుంచి అనేకమంది బాధితులు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి తమ తమ ఫిర్యాదులను కలెక్టర్ ఇలా త్రిపాఠి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజ్‌కుమార్‌లకు అందజేశారు. కలెక్టర్, అదనపు కలెక్టర్లు వచ్చిన బాధితుల నుంచి ఫిర్యాదులను సేకరించి వాటిలో కొన్నింటిని అక్కడికక్కడే పరిష్కరించగా మరికొన్ని సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులకు అందజేశారు.
ఎనిమిది నెలలుగా తిప్పించుకుంటున్నారు
పుట్ట పరమేష్, చందుపట్ల, నకిరేకల్
నేను మా గ్రామ శివారులోని సర్వే నెంబ ర్ 738లో ఎకరం 7 గుంటల భూమిని కొనుగోలు చేశాను. ఆ భూమి మ్యుటేషన కోసం ఎనిమిది నెలల క్రితం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాను. నేటి కి కూడా నాకు డిజిటల్ పాస్ పుస్తకాలు మంజూరు కాలేదు. పాస్ పుస్తకాల కోసం స్థానిక అధికారులకు రూ.20 వేల వరకు అప్పగించారు. అయినా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. అధికారులను ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటున్నారే తప్ప పాస్ పుస్తకాలు మాత్రం ఇవ్వడం లేదు. దయచేసి విచారణ జరిపించి డిజిటల్ పాస్ పుస్తకాలు ఇప్పించండి.
ఇల్లు ఇప్పించండి
ధనావత నాగు, బడాయి గడ్డ తండా, త్రిపురారం
నేను నిరుపేద కుటుంబానికి చెందిన వాడను. రెక్కాడితేగానే డొక్కడిని పరిస్థితి. నాకు గ్రామంలో చిన్న ఇల్లు ఉంది. అయితే ఇటీవల జరిగిన విద్యుత ప్రమాదంలో ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. నాకు సొంతంగా ఇల్లు కట్టుకునే శక్తి లేదు. దీంతో పూరి గుడిసెలో నివసిస్తున్నాను. విద్యుత ప్రమాదం జరిగి ఇల్లు కాలిపోయినప్పుడు కూడా నాకు ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్టపరిహారం అందలేదు. దయచేసి ఇందిరమ్మ ఇళ్లలో ఇంటిని మంజూరు చేసి న్యాయం చేయండి.
ఇందిరమ్మ ఇల్లు కేటాయింపులో అవకతవకలు
షేక్ అన్వరున్సిసాబేగం, లైనవాడ, నల్లగొండ
నిరుపేద కుటుంబానికి చెంది న నేను 15 సంవత్సరాలుగా అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నా ను. నాకు ఇంటి స్థలం ఉండటం తో ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేసుకున్నాను. వార్డు సభ అనంతరం ఇందిరమ్మ లబ్ధిదారుల జాబితాలో లిస్ట్ ఒకటిలో నా పేరు వచ్చింది. ఇటీవల విడుదల చేసిన జాబితాలో మా త్రం నా పేరును లిస్ట్-3 లో చేర్చారు. దీంతో నేను అధికారులను సంప్రదించగా స్పందన లేదు. లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయి. వాస్తవానికి నాకు ఎలాంటి ఇల్లు, ఆస్తులు లేవు. నా భర్త కూలి పనిచేసి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. దయచేసి పూర్తిస్థాయిలో విచారణ జరిపించి అన్ని అర్హతలు ఉన్న తనకు న్యాయం చేయాలి.
పింఛన ఇప్పించండి
జగని రాము, తుమ్మలపెల్లి, చండూరు
నేను పుట్టుకతోనే మూగవాడిని. దివ్యాంగుల పింఛన కోసం ఆరు సంవత్సరాలుగా అధికారులు, కార్యాలయ చుట్టూ తిరుగుతున్నాను. అయినా ఫలితం లేదు. గతంలో సదరం సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేసుకోగా అధికారులు చేసిన తప్పిదం వల్ల పర్సంటేజీ తక్కువగా వేశారు. తిరిగి మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నించిన సాంకేతిక సమస్య వల్ల రెండోసారి రాదు అంటున్నారు. ఆరేళ్లుగా ప్రజాప్రతినిధులు అధికారులను కలిసి విన్నవిస్తూనే ఉన్నాను. నిరుపేద కుటుంబానికి చెందిన తనకు దివ్యాంగుల పింఛన ఇప్పించి ఆదుకోవాలి.
ఎనిమిది నెలలుగా తిప్పించుకుంటున్నారు
పుట్ట పరమేష్, చందుపట్ల, నకిరేకల్
నేను మా గ్రామ శివారులోని సర్వే నెంబ ర్ 738లో ఎకరం 7 గుంటల భూమిని కొనుగోలు చేశాను. ఆ భూమి మ్యుటేషన కోసం ఎనిమిది నెలల క్రితం తహసీల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాను. నేటి కి కూడా నాకు డిజిటల్ పాస్ పుస్తకాలు మంజూరు కాలేదు. పాస్ పుస్తకాల కోసం స్థానిక అధికారులకు రూ.20 వేల వరకు అప్పగించారు. అయినా పాస్ పుస్తకాలు ఇవ్వడం లేదు. అధికారులను ఎప్పుడు అడిగినా రేపు మాపు అంటున్నారే తప్ప పాస్ పుస్తకాలు మాత్రం ఇవ్వడం లేదు. దయచేసి విచారణ జరిపించి డిజిటల్ పాస్ పుస్తకాలు ఇప్పించండి.
న్యాయం చేయండి
ఎంపాల శ్రీనివాస్, బీరెల్లిగూడెం, మునుగోడు
మా గ్రామంలోని సర్వే నెంబర్ 378లో నాకు 2.12 గుంటల భూమి ఉంది. ఆ భూమిని ఎంతోకాలంగా సేద్యం చేసుకుంటూ మా కుటుంబం జీవనోపాధి పొందుతుంది. ప్రస్తుతం కూడా మేమే సేద్యం చేసుకుంటున్నాం. అయితే ఇటీవల వచ్చిన పాస్ పుస్తకాల్లో మా భూమి పొరపాటుగా ఎప్పుడో గ్రామం నుంచి వెళ్లిపోయిన వ్యక్తుల పేరిట నమోదైంది. అదేమిటని ప్రశ్నిస్తే స్థానిక రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కబ్జాలో ఉం డి సేద్యం చేసుకుంటున్న తమ పేరు కాదని ఎప్పు డో 30 సంవత్సరాల క్రితం ఊ రినుండి వెళ్లినవారి పేరిట పాస్ పుస్తకాలు మంజూరు చేయడం ఏమిటని ప్రశ్నించారు. ధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలి.