సమాజ సేవ కోసమే లయన్స్‌క్లబ్ ఏర్పాటు
ABN , Publish Date - Jun 22 , 2025 | 11:40 PM
సమాజ సేవ చేయడం కోసమే లయ న్స్‌క్లబ్ ఆఫ్ జైపూర్ పవర్‌ను ఏర్పాటు చేసినట్లు లయన్స్‌క్లబ్ జిల్లా గవర్నర్ ఎన్. వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు.
జైపూర్, జూన్ 22 (ఆంధ్రజ్యోతి) : సమాజ సేవ చేయడం కోసమే లయ న్స్‌క్లబ్ ఆఫ్ జైపూర్ పవర్‌ను ఏర్పాటు చేసినట్లు లయన్స్‌క్లబ్ జిల్లా గవర్నర్ ఎన్. వెంకటేశ్వర్‌రావు పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలో ని దుబ్బపల్లి ఫంక్షన్‌హాలులో లయన్స్‌క్లబ్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్య క్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. లయన్స్‌క్లబ్ ఆఫ్ రామగుండం ప రిధిలో జైపూర్ మండలంలో లయన్స్‌క్లబ్ ఏర్పాటు చేయడం గర్వించదగ్గ వి షయమన్నారు. లయన్స్‌క్లబ్ ద్వారా మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లోని పేదలకు సహాయ పడాలని ఆయన సూచించారు. లయన్స్‌క్లబ్‌కు వచ్చిన ఆ దాయాన్ని పేద ప్రజల కోసం వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామన్నారు. వృద్ధులకు ఉచితంగా కంటి వైద్య శస్త్ర చికిత్సలు చేయిస్తున్నామన్నారు. జై పూర్‌లో ఏర్పాటు చేసిన లయన్స్‌క్లబ్ ద్వారా సమాజ సేవ కార్యక్రమాలు చే పట్టాలన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన జైపూర్ లయన్స్‌క్లబ్ ఆఫ్ జైపూ ర్ పవర్ కమిటీ సభ్యుల చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అధ్యక్షుడిగా చల్ల సత్యనారాయణరెడ్డి, సెక్రటరీగా మంతెన లక్ష్మణ్, ట్రెజరర్‌గా ముదం రమేష్, కమిటీ సభ్యులను ఘనంగా శాలువాలతో సన్మానించి ధృవీకరణ పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్‌క్లబ్ సభ్యులు మల్లికా ర్జున్, నారాయణరెడ్డి, ప్రమోద్‌కుమార్ రెడ్డి, శ్రీనివాసరావు, ఆనంద్, సంప త్‌రావు, రాజేందర్ పాల్గొన్నారు.