Share News

Building Demolished: లింగంపల్లి గురుకుల హాస్టల్‌ భవనం కూల్చివేత

ABN , Publish Date - Sep 11 , 2025 | 04:48 AM

సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి బాలుర గురుకుల సోసైటీ హాస్టల్‌ భవనాన్ని పూర్తిగా కూల్చివేశారు...

Building Demolished: లింగంపల్లి గురుకుల హాస్టల్‌ భవనం కూల్చివేత

  • నూతన భవనానికి రూ. 10 కోట్ల మంజూరు

  • కొంతభాగం కూలి విద్యార్థులకు గాయాలైన నేపథ్యంలో చర్యలు

మునిపల్లి, సెప్టెంబర్‌ 10 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం లింగంపల్లి బాలుర గురుకుల సోసైటీ హాస్టల్‌ భవనాన్ని పూర్తిగా కూల్చివేశారు. ఈ హాస్టల్‌ భవనం కూలిన ఘటనలో ముగ్గురు విద్యార్థులకు గాయాలైన విషయం తెలిసిందే. కూలిన భవనాన్ని పరిశీలించిన మంత్రి దామోదర నూతనభవనం కోసం రూ.10కోట్లు మంజూ రు చేశారు. ఈ మేరకు బుధవారం కూల్చివేత పనులు ప్రారంభించారు. కూలిపోయిన భవనాన్ని తెలంగాణ గురుకులాల కార్యదర్శి రమణకుమార్‌ పరిశీలించారు. ఇటీవల నిర్మించిన తరగతి గదులపై తాత్కాలిక షెడ్లు వేసి విద్యార్థులకు వసతి కల్పించాలని ఆయన సూచించారు.

Updated Date - Sep 11 , 2025 | 04:48 AM