Share News

బియ్యం కోసం బారులు

ABN , Publish Date - Jun 06 , 2025 | 11:16 PM

వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు ఇబ్బందులు కలు గకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చిన విధంగా ఒకేసారి మూడు నెలల బియ్యం పంపి ణీకి భారీ స్పందన లభిస్తోంది. ఉదయం 7గంటల నుంచే షాపుల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నా రు.

బియ్యం కోసం బారులు

కిక్కిరిసిపోతున్న చౌకధరల దుకాణాలు

టోకెన్ల పద్ధతిని అవలంబిస్తున్న డీలర్లు

రోజుకు రెండుపూటలా పంపిణీ

డీలర్లకు తప్పని ఇబ్బందులు

మంచిర్యాల, జూన్‌6 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని లబ్ధిదారులకు ఇబ్బందులు కలు గకుండా ఉండడం కోసం కేంద్ర ప్రభుత్వం నిర్ణయిం చిన విధంగా ఒకేసారి మూడు నెలల బియ్యం పంపి ణీకి భారీ స్పందన లభిస్తోంది. ఉదయం 7గంటల నుంచే షాపుల వద్ద లబ్ధిదారులు బారులు తీరుతున్నా రు. రద్దీని దృష్టిలో ఉంచుకొని డీలర్లు టోకెన్ల పద్ధతి అ వలంబిస్తున్నారు. రెండు పూటల చౌకధరల దుకాణం లో బియ్యం పంపిణీ చేస్తున్న రద్దీ ఏమాత్రం తగ్గడం లేదు. పైగా సన్నబియ్యం కావడంతో వాటిని తీసుకు నేందుకు లబ్ధిదారులు ఎగబడుతున్నారు. గతంలో రేష న్‌దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేయగా లబ్దిదారుల్లో సగానికిపైగా వాటిని తినేందుకు ఇష్టప డేవారు కాదు. దీంతో ఆ బియ్యాన్ని బయట మార్కెట్‌ లో, డీలర్లకు విక్రయించేవారు. ప్రస్తుతం బియ్యం తిన గలిగే విధంగా ఉండడంతో లబ్ధిదారులు క్రమం తప్ప కుండా తీసుకెళ్తున్నారు. దీంతో సన్నబియ్యం అక్రమ ర వాణా సైతం తగ్గుముఖం పట్టింది. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఉగాది నుంచే సన్నబియ్యం పంపిణీకి రేవంత్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టింది.

డీలర్లకు తప్పని ఇక్కట్లు..

సన్న బియ్యం పంపిణీకి కాంగ్రెస్‌ ప్రభుత్వం శ్రీకారం చుట్టడంతో లబ్ధిదారులు వాటిని తినేందుకు ఇష్టపడు తున్నారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల కు చెందిన వారు బియ్యాన్ని సక్రమంగా తీసుకుంటు న్నారు. ఉగాది నుంచే రేషన్‌షాపుల వద్ద లబ్దిదారులు బారులు తీరుతుండగా ఒకేసారి మూడు నెలల పంపి ణీ కార్యక్రమంతో మరింతగా వారి సంఖ్య రెట్టింపైంది. 1వ తేదీ నుంచి 15 వరకు బియ్యం పంపిణీ చేసే సమ యం ఉన్నప్పటికీ ముందుగా తీసుకోవాలన్న కుతూ హలంతో ఉదయం నుంచే లబ్దిదారులు బారులు తీరు తున్నారు. దీంతో రేషన్‌ డీలర్లపై అధిక పనిభారం త ప్పడం లేదు. దీనికి తోడు సర్వర్లు సక్రమంగా పని చేయకపోవడంతో వేలి ముద్రలు, ఐరిష్‌ సేకరణలో తీ వ్ర జాప్యం జరుగుతోంది. మరోవైపు లబ్ధిదారులకు కేం ద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 5ః1నిష్పత్తిలో బియ్యం పంపిణీ చేస్తున్నాయి. ఒక్కో లబ్ధిదారుడికి 6కిలోల చొప్పున పం పిణీ చేయాల్సి ఉంటుంది. గతంలో గంప గుత్తగా ఒ క్కో లబ్ధిదారుడికి 6కిలోలు జోకి డీలర్లు అందజేసేవా రు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ వాటా ల ప్రకారం వేర్వేరుగా బియ్యం జోకాల్సిన నెలకొన్నా యి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఐదు కిలోలు, రా ష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కిలో బియ్యం వేర్వేరు గా జోకుతున్నారు. ఇందుకుగాను లబ్ధిదారుడి నుంచి రెండేసిసార్లు వేలిముద్రలు, ఐరిష్‌ సేకరించాల్సి వస్తోం ది. ఈ క్రమంలో రోజుకుసగటున 20 మందికి కూడ బియ్యం పంపిణీ జరుగడం లేదు. ఉదయం 7 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 5 నుంచి 7గంటల వ రకు బియ్యం పంపిణీ చేస్తున్న రద్దీ తగ్గడం లేదు. ఈ క్రమంలో లబ్ధిదారుడికి బియ్యం పంపిణీ చేయాలం టే కనీసం 15నిమిషాల సమయం పడుతుందని డీలర్లు చెబుతున్నారు. మూడు నెలలకు సంబంధించి బి య్యం పంపిణీ చేయాల్సి రావడంతో మూడు సార్లు వే ర్వేరుగా బయోమెట్రిక్‌ తీసుకోవాల్సి వస్తుం దంటున్నారు.

నిర్ణీత సమయం పెంచాలి...

రేషన్‌ షాపుల వద్ద బయోమెట్రిక్‌ సేకరించేందుకు లబ్ధిదారుడికి అధిక సమయం పడుతుండడంతో నిర్ణీత గడువులోపు పూర్తిస్థాయిలో బియ్యం పంపిణీ జరిగేలా లేదు. సాధారణంగా ప్రతి నెల 1వ తేదీ నుంచి 15 వర కు చౌకధరల దుకాణాల్లో బియ్యం పంపిణీ జరుగు తుంది. అలా ఒక్కో షాపుల పరిధిలోని లబ్ధిదారులకు పంపిణీ చేసేందుకు సమయం అనుకూలంగా ఉంటుం ది. కానీ పాతగడువు ప్రకారమే మూడు నెలల బియ్యం పంపిణీ చేయాలంటే సమయం సరిపోదనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి. నిర్ణీత 15 రోజుల సమ యమే కాకుండా అదనంగా మరో పది రోజులు పెం చాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే పో ర్టబుల్‌ సిస్టం ద్వారా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నట్లు డీలర్లు వాపోతున్నారు. పోర్టబుల్‌ సిస్టం పద్ధ తిలో మరో గ్రామానికి చెందిన రేషన్‌కార్డుల లబ్ధిదా రులకు వారు కోరుకున్న చోట బియ్యం పంపిణీ చేయా ల్సి ఉంటుంది. ఈ క్రమంలో ఎంత మంది ఇతరులు బియ్యం తీసుకుంటారో తెలియని పరిస్థితుల్లో అసలు లబ్ధిదారులకు ఉన్న స్టాక్‌ నుంచి అందుతాయా లేదా అన్న సందేహం నెలకొంది. దీనికి గాను ఇతర ప్రాంతా లకు చెందిన వారికి పంపిణీ చేసేందుకు అదనపు బి య్యం కేటాయించాలనే విజ్ఞప్తులు ఉన్నాయి. లేని పక్షం లో అసలు లబ్ధిదారులకు కొరత ఏర్పడి గొడవలు జరిగే అవకాశాలు ఉన్నట్లు లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ విషయమై అధికారులు దృష్టి సారించి నిర్ణీత కోటాకం టే అదనపు బియ్యం సరఫరా చేయాలని కోరుతున్నా రు. మరోవైపు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి సరఫరా అయ్యే 50 కేజీల బస్తాలో కొన్ని సందర్భాల్లో 40 కేజీ లు, ఆ పైన వస్తుండడంతో బియ్యం కొరత ఏర్పడు తుందని తెలుస్తోంది. ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల వద్దనే స రైన తూకం వేసి బియ్యం సరఫరా చేయాల్సి అవసరం ఉంది.

Updated Date - Jun 06 , 2025 | 11:16 PM