Share News

kumaram bheem asifabad- చిరు జీవితాల్లో వెలుగులు

ABN , Publish Date - Aug 08 , 2025 | 11:08 PM

పిల్లలు బడిలో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం బాలకార్మికుల వ్యవస్థ విముక్తి కోసం ఏటా ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాలు చేపడుతోంది. జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా బాల కార్మికులను గుర్తించి బడిలో చేర్పిస్తున్నారు.

kumaram bheem asifabad- చిరు జీవితాల్లో వెలుగులు
లోగో

- అధికారుల బృందం ఏటా రెండు సార్లు తనిఖీ

- డ్రాప్‌ అవుట్‌, బాల కార్మికులకు విముక్తి

పిల్లలు బడిలో ఉండాలన్న లక్ష్యంతో ప్రభుత్వం బాలకార్మికుల వ్యవస్థ విముక్తి కోసం ఏటా ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌ కార్యక్రమాలు చేపడుతోంది. జనవరిలో ఆపరేషన్‌ స్మైల్‌, జూలైలో ఆపరేషన్‌ ముస్కాన్‌ ద్వారా బాల కార్మికులను గుర్తించి బడిలో చేర్పిస్తున్నారు.

ఆసిఫాబాద్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం బడికి దూరమైన వారు, అనాథ పిల్లల ను, బాల కార్మికులను గుర్తించేందుకు ఏడాది రెండు సార్లు ఆపరేషన్‌ స్మైల్‌, ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో తనిఖీ కార్యక్రమాలు చేపడుతోంది. తెలంగాణ రాష్ట్రం అవత రించాక రాష్ట్రంలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూళన, బడి బయట పిల్లలు లేకుండా చేయడం, వీధి బాలలు లేకుండా చేయడం, పరిశ్రమల్లో బాల్యంను బందిం చకుండా చేయడం, భిక్షాటన చేసే బాలలు లేకుండా చూడడం వంటి లక్ష్యాలతో ప్రభుత్వం కార్యాచరణను రూపొందించింది.

- అధికారులతో కూడిన బృందం..

దీనిలో భాగంగా మహిళా శిశు సంక్షేమ, పోలీసులు, లేబర్‌ అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసింది. ఏడాదికి రెండు సార్లు అన్ని పారిశ్రామిక ప్రాంతాలు, దుకాణాలు వంటి వాటిని తనిఖీ చేసి ఇ లాంటి పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు గుర్తిం చడం, పునరావాసం కల్పించడం, పాఠశాలలో చేర్పిం చడం వంటివి చేపడుతున్నారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మొట్ట మొదటి సారిగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్‌ స్మైల్‌ పేరుతో , జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్‌ ముస్కాన్‌ పేరుతో కార్యక్రమాలను చేపడుతున్నారు. కాగా 2016 అక్టోబరు 11న కుమరం బీం ఆసిఫాబాద్‌ జిల్లా ఏర్పడింది. దీంతో 2017 జనవరి నుంచి జిల్లాలో ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ ఏడాది జనవరి1 నుంచి 31 వరకు ఆపరేషన్‌ స్మైల్‌, జూలై 1 నుంచి 31 వరకు ఆపరేషన్‌ ముస్కా న్‌ కార్యక్రమాన్ని అధికారులు పూర్తి చేశారు. బాల కార్మికులను పనిలో పెట్టుకుంటే బాల కార్మిక నిరోధక చట్టం కింద యజమానులకు రెండేళ్ల జైలు శిక్ష, లక్ష రూపాయల జరిమానా విధించడం జరు గుతుందని అధికారులు చెబుతున్నారు.

- 105 మంది గుర్తింపు..

జిల్లాలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ డివిజన్లలో మొ త్తం 105మంది బాల బాలికలను గుర్తించారు. జిల్లా లో ఈ ఏడాది 11వ విడతగా ఈ కార్యక్రమాన్ని అధికారులు పకడ్బందీగా నిర్వహించారు. ఈ దాడుల్లో పట్టుకున్న వారిని పాఠశాలల్లో చేర్పించడంతో పాటు వారి తల్లిదండ్రులకు అప్పగిం చినట్లు అధికారులు చెబుతున్నారు. కాగా బాల కార్మికులను పనిలో పె ట్టుకుంటే జూనైల్‌ జస్టిస్‌ యాక్ట్‌ 2015 సెక్షన్‌ 79 ప్రకా రం కేసులు నమోదు చేస్తామని అధికారులు చెబుతు న్నారు.

పిల్లలను పనిలో పెట్టుకోవద్దు..

- మహేష్‌, జిల్లా బాలల సంరక్షణాధికారి

ఎట్టి పరిస్థితుల్లోనూ పిల్లలను పనిలో పెట్టుకోకూడ దు. పనిలో పెట్టుకున్నట్లుయితే యజమాను లపై క్రిమినల్‌ కేసులు నమోదవుతాయి. తల్లిదండ్రులు సైతం బాల బాలికలను బడికి పంపించాలి. బాల్యాన్ని బంధి చేయడానికి ఎవరు ప్రయత్నించినా ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. బాల్య వివా హాలు చేయడం కూడా చట్ట ప్రకారం నేరం. బాల్యం వివాహం చేస్తే వధూవరుల తల్లిదండ్రులపైనే కాకుం డా ప్రోత్సహించిన. వారిపై కూడా కేసులు నమోద వుతాయి.

Updated Date - Aug 08 , 2025 | 11:08 PM