kumaram bheem asifabad- కుమరం భీం ప్రాజెక్టు రెండు గేట్ల ఎత్తివేత
ABN , Publish Date - Aug 10 , 2025 | 11:01 PM
ఎగువన కురుస్తున్న వర్షాలకు మండలంలోని కుమరం భీం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా 237.10 మీటర్లకు చేరుకున్నది. ప్రాజెక్టులోకి 574 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు రెండు గేట్లు పైకి ఎత్తి 1,210 క్యూసెక్కుటల వరద నీరు బయటకు వదులుతున్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, ఆగస్టు 10 (ఆంధ్రజ్యోతి): ఎగువన కురుస్తున్న వర్షాలకు మండలంలోని కుమరం భీం ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 243 మీటర్లు కాగా 237.10 మీటర్లకు చేరుకున్నది. ప్రాజెక్టులోకి 574 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు రెండు గేట్లు పైకి ఎత్తి 1,210 క్యూసెక్కుటల వరద నీరు బయటకు వదులుతున్నారు. పెద్దవాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. కాగా జిల్లాలో ఆదివారం ఓ మోస్తరు వర్షం కురిసింది. మధ్యాహ్నం ఆకాశం మేఘావృతమై సాయంత్రం జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. బెజ్జూరులో అత్యధికంగా 16.3 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. లింగాపూర్‌లో 6.8, వాంకిడిలో 6.3, సిర్పూర్(టి)లో 1.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది.