Share News

లిఫ్ట్‌ పనులు నీటి మూటలే

ABN , Publish Date - Nov 07 , 2025 | 12:20 AM

భూగర్భజలాలు పెంపొం దించాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసినా పనులు ముందుకు సాగడంలేదు.

లిఫ్ట్‌ పనులు నీటి మూటలే
కొనసాగుతున్న తోపుచర్ల పంప్‌హౌస్‌ పనులు

నత్తనడకన తోపుచర్ల లిఫ్టు పనులు

పూర్తయితే 316 ఎకరాలకు నీరు

మరో 500 ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశం

మాడ్గులపల్లి, నవంబరు 6(ఆంధ్రజ్యోతి): భూగర్భజలాలు పెంపొం దించాలనే లక్ష్యంతో ఎత్తిపోతల పథకాలు మంజూరు చేసినా పనులు ముందుకు సాగడంలేదు. లిఫ్ట్‌ పనులు పూర్తిచేసి చెరువులు నింపు తామని ఎన్నికల సమయంలో గ్రామాల్లోకి వచ్చి నాయకులు ప్రచారం చేసిన మాటలు నీటి మూటలుగా మిగులుతున్నాయి. రూ.10కోట్లతో తోపుచర్ల లిఫ్టు పనులు చేపడతామని గత ప్రభుత్వం ప్రకటించినా అధి కారులు మాత్రం పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. లిఫ్టు పనులు పూర్త యితే మేలు జరుగుతుందనుకున్నా పనులు నత్తనడకగా కొనసాగడ ంతో రైతులు అయోమయంలో ఉన్నారు. నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలంలోని నాగార్జునసాగర్‌ ఎడమకాల్వ ఎల్‌-14 స్టేజ్‌ 1-పంప్‌ హౌస్‌ నుంచి తోపుచర్ల, పుచ్చకాయలగూడెం, సీత్యాతండా, దేవతల బావిగూడెం, గణపతివారిగూడెం, బొమ్మకల్‌ గ్రామాల గొలుసు కట్టు చెరువులు నింపేందుకు లిఫ్టు మంజూరైంది. భూములు సర్వే చేసి వేములపల్లి మండల పరిధిలోని ఎల్‌-14 స్టేజ్‌-1 పంప్‌హౌస్‌ నుంచి తోపుచర్ల, పుచ్చ కాయలగూడెం వరకు 5.6 కిలో మీటర్ల మేర భూగర్భ పైపులైన్‌ వేసి చివరి చెరువులకు నీటిని నింపేందుకు వీలుగా ఉంటుందని అధి కారులు ప్రతిపాదించారు. తోపుచర్ల గ్రామం లోని పెద్ద చెరువు, చిన్న చెరువు, సీత్యాతండా చెరువు, గణపతివారి గూడెం చెరువు, దేవతల బావిగూడెం చెరువు, బొమ్మకల్‌ చెరువులోకి నీటిని నింపడం ద్వారా సాగు, తాగునీటి కష్టాలు తీరతాయని అను కున్న రైతులకు నిరాశే మిగిలింది. ఇప్పటివరకు లిఫ్టు పనులు పూర్తికాక వ్యవసాయ ఆధారమైన పత్తి, వరిపంటను సేద్యం చేస్తున్నారు. ఆరు చెరు వులను నింపడం ద్వారా 316 ఎకరాలకు నీరందే అవకాశమున్నా అనుకున్న స్థాయిలో పనులు జరగకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. లిఫ్టు పనులు పూర్తయి చెరువులోకి నీరు చేరి భూగర్భజలాలు వృద్ధి చెందడంతోపాటు బోరుబావుల కింద సుమారు మరో 500ఎకరాలు సాగులోకి వచ్చే అవకాశముందని రైతులు భావి స్తున్నారు. ప్రభుత్వం ఏర్పడిరెండు సంవత్సరాలు అయినా లిఫ్టు పనుల్లో పంప్‌హౌస్‌ పనులు మాత్రమే పూర్తయిందని అధికారులు పేర్కొన్నారు.

పైపులైన్‌కు అడ్డంకిగా..

ఎల్‌-14 స్టేజ్‌1 పంప్‌హౌస్‌ నుంచి పుచ్చకాయలగూడెం వరకు 5.6 కిలో మీటర్ల పైపులైన్‌ పనులు ప్రారంభానికి నోచుకోలేదు. గత ప్రభు త్వంలో లిఫ్టు పనులను పూర్తిచేసినా ఇప్పటివరకు పైపులైన్‌ పనులకు మోక్షం కలగలేదు. పంప్‌హౌస్‌ నుంచి పుచ్చకాయలగూడెం వరకు 5.6 కిలో మీటర్ల మేరా ఉన్న పైపులైన్‌కు వ్యవసాయ భూములు అడ్డంకిగా మారింది. ఈ సీజన్‌లో వర్షాలు సమృద్ధిగా కురవడంతో 5 కిలో మీటర్ల మేరా ఉన్న భూముల్లో రైతులు వరి పంటలను సాగు చేశారు. కోతలు కోసినా మళ్లీ వేసవి పంటకు రైతులు నార్లు పోసుకొని వ్యవసాయం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. దీంతో పైపులైన్‌ ఏర్పాటు ప్రక్రియ ఈ సీజన్‌లో జరిగే అవకాశం లేదు. రైతులతో మాట్లాడి పైపులైన్‌ పనులను చేపడితే పైపులైన్‌ ఏర్పాటు పూర్తవుతుందని లేకపోతే ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదని తెలుస్తోంది.

పైపులైన్‌ పనులు త్వరలో చేపడతాం

మాడ్గులపల్లి తోపుచర్ల లిఫ్టు పంప్‌హౌస్‌ పనులు నడుస్తున్నాయి. ఎక్కువ మంది రైతులు వరి పొలాలు వేయడంతో పైపులైన్‌ పనులకు ఆటంకం ఏర్పడుతుంది. వేసవి వరి కోతల తర్వాత పైపులైన్‌ పనులను ప్రారంభించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం.

వి. శివకుమార్‌, ఎన్‌ఎస్‌పీ డీఈఈ.

తోపుచర్ల లిఫ్టు పనులు పూర్తిచేయాలి

తోపుచర్ల లిఫ్టు పనులు త్వరగా పూర్తిచేయాలి. నీటి కోసం ప్రతిసారి ఇబ్బందులు పడుతున్నాం. వర్షాలు సమృద్ధిగా కురవడంతో చెరువుల్లోకి నీరు రావడంతో వ్యవసాయం చేసుకోగలుగుతున్నాం. లిఫ్టు పనులు ప్రారంభించి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకు అధికారులు పూర్తి చేయడం లేదు. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిఽధులు స్పంది ంచి లిఫ్టు పనులను పూర్తిచేసి చెరువులను నింపాలి.

మారుతి వెంకట్‌రెడ్డి, రైతు, బొమ్మకల్‌

Updated Date - Nov 07 , 2025 | 12:20 AM