Share News

kumaram bheem asifabad- ప్రాణహిత నిర్మాణ స్థలం పరిశీలన

ABN , Publish Date - Oct 07 , 2025 | 11:20 PM

కుమరం భీం జిల్లా కౌటాల మండలంలోని ప్రాణహిత నదిపై ప్రాజెక్టు ప్రతిపాదన స్థలాన్ని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మంగళవారం పరిశీలించారు. ప్రాణహిత నదిలో మట్టి, ఇసుక, రాయి స్వభావంపై ఇంజ నీరింగ్‌ శాఖ అధికారులను అడిగి తెలుపుకున్నారు.

kumaram bheem asifabad- ప్రాణహిత నిర్మాణ స్థలం పరిశీలన
తుమ్మిడిహెట్టి వద్ద మ్యాప్‌ను పరిశీలిస్తున్న రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌

కౌటాల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లా కౌటాల మండలంలోని ప్రాణహిత నదిపై ప్రాజెక్టు ప్రతిపాదన స్థలాన్ని రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ మంగళవారం పరిశీలించారు. ప్రాణహిత నదిలో మట్టి, ఇసుక, రాయి స్వభావంపై ఇంజ నీరింగ్‌ శాఖ అధికారులను అడిగి తెలుపుకున్నారు. ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం కోసం రాష్ట్ర ఇరిగేషన్‌ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ తుమ్మిడిహెట్టి ప్రాణహిత నదిని సందర్శించారు. ప్రాజెక్టు గతంలో నిర్మించేందుకు గుర్తించిన స్థలం, ప్రస్తుత ప్రతిపాదిత స్థలం గురించి అధికారులు మ్యాప్‌ ద్వారా వివరించారు. ప్రాణహిత తీరంలో తిరిగి ప్రతీ విషయాన్ని పరిశీలించారు. సమగ్ర వివరాలు అందించాలని ఆదేశించారు. ఇరిగేషన్‌ అధికారులు తుమ్మిడిహెట్టికి ఎగువన వార్దా, వైన్‌గంగల సంగమంతో ప్రాణహితగా ఏర్పడే ప్రాంతాన్ని మ్యాప్‌లో చూపించారు. ప్రధానంగా ఆయన ప్రాజెక్టు బ్యారేజీ నిర్మాణం జరిగే ప్రాంతం వివరాలు పూర్తి స్థాయిలో పరిశీలించారు. కొన్ని రోజులుగా ప్రాణహిత ప్రాజెక్టుపై కాంగ్రెస్‌ ప్రభుత్వం సానుకూల దృక్పథంతో ఉండడం, అధికారులు పరిశీలించడం ప్రాజెక్టు నిర్మాణంపై ప్రాధాన్యత సంతరించుకుంది. కార్యక్రమంలో ఇరిగేషన్‌ చీఫ్‌ ఇంజీనిర్‌ సత్యరాజచంద్ర, కాగజ్‌నగర్‌ ఎస్‌ఈ రవికుమార్‌, ఈఈ ప్రభాకర్‌, తహసీల్దార్‌ ప్రమోద్‌కుమార్‌, డీఈ ఎల్లా వెంకటరమణ భద్రయ్య, తిరుపతి, భానుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 11:20 PM