నిబంధనలు పాటించని వారి లైసెన్సులు రద్దు చేస్తాం
ABN , Publish Date - Oct 07 , 2025 | 11:30 PM
మంచిర్యాల ప్రజలు దీపావళిని ఆనందోత్సాహాలతో ప్రమాదాలు జరగకుండా జరుపుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ న్నారు. మంగళవారం టపాసుల విక్రయదారుల హోల్ సేల్స్ యజమానులతో సమీక్ష నిర్వహించారు.
డీసీపీ భాస్కర్
మంచిర్యాల క్రైం, అక్టోబరు 7(ఆంధ్రజ్యోతి) : మంచిర్యాల ప్రజలు దీపావళిని ఆనందోత్సాహాలతో ప్రమాదాలు జరగకుండా జరుపుకోవాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్ న్నారు. మంగళవారం టపాసుల విక్రయదారుల హోల్ సేల్స్ యజమానులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చైనా బాంబులను విక్రయంచరాదని హెచ్చరించారు. నిబందనలు పాటి ంచని వారి లైసెన్సులన రద్దు చేస్తామన్నారు. విక్రయదారులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని, 16 వరకు అనుమతులు ఇస్తామన్నారు. ముందస్తుగా టపాసుల దుకాణం ఏర్పాటు చేసుకునే స్థల యజమానితో ఒప్పందం చేసుకొని ఒప్పందం ప్రకారం గ్రామ పంచాయతీ, మున్సిపల్ పరిధిలో అందరి అధికారుల అనుమతులు తీసుకోవాలన్నారు. టపాసుల దుకాణ సముదాయంలో పార్కింగ్ స్థలాన్ని విధిగా ఏర్పాటు చేసుకోవాలని, అగ్ని మాపక శాఖ ఽ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ ముందుగా టపాసు దుకాణాలు జనావాసాలకు దూరంగా ఉండాలని, నిబందనలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ప్రకాష్, సీఐ ప్రమోద్‌రావు,రూరల్ సీఐ అశోక్, ఎస్సైలు, ఏఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.