Share News

kumaram bheem asifabad- శిథిలావస్థలో గ్రంథాలయం

ABN , Publish Date - Nov 08 , 2025 | 10:36 PM

రెబ్బెనలో కొనసాగుతున్న గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకున్నది, ఇరుకు గదిలో సౌకర్యాలు లేక పాఠకులు అవస్థలు పడుతున్నారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ పాత భవనంలోకి మార్చేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రంథాలయం జ్ఙాన సముపార్జనకు కేంద్రం. పుస్తక పఠనం ద్వారా విద్యార్ధుల్లో నైతిక విలువలు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వం లక్షణాలు పెంపొందిస్తాయి.

kumaram bheem asifabad- శిథిలావస్థలో గ్రంథాలయం
నిరుపయోగంగా ఉన్న పోలీస్‌స్టేషన్‌ పాత భవనం

రెబ్బెన, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి): రెబ్బెనలో కొనసాగుతున్న గ్రంథాలయ భవనం శిథిలావస్థకు చేరుకున్నది, ఇరుకు గదిలో సౌకర్యాలు లేక పాఠకులు అవస్థలు పడుతున్నారు. దీంతో పోలీస్‌స్టేషన్‌ పాత భవనంలోకి మార్చేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. గ్రంథాలయం జ్ఙాన సముపార్జనకు కేంద్రం. పుస్తక పఠనం ద్వారా విద్యార్ధుల్లో నైతిక విలువలు వ్యక్తిత్వ వికాసం, నాయకత్వం లక్షణాలు పెంపొందిస్తాయి. పేద విద్యార్థులు, నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకొని రెబ్బెన పోలీస్‌ శాఖ గ్రంఽథాలయం ఏర్పాటుకు శ్రీకారం చుట్టబోతోంది. రెబ్బెన పాత పోలీస్‌స్టేషన్‌లో భవనం ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. ఎంపీడీవో కార్యాలయ సమీపంలో కొత్తగా పోలీస్‌స్టేషన్‌ భవనం నిర్మించడంతో సుమారు మూడేళ్ల క్రితం అందులోకి మార్చారు. దీంతో తహసీల్దార్‌ కార్యాలయం పక్కన ఉన్న పోలీస్‌స్టేషన్‌ భవనం నిరుపయోగంగా మారింది. ముందు భాగంలో పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. దీంతో దీన్ని వినియోగంలోకి తీసుకురావాలని భావించారు. తిర్యాణి మండల కేంద్రంలో ఇదే తరహా మాదిరిగా రెబ్బెన పోలీస్‌స్టేషన్‌ పాత భవనాన్ని గ్రంథాలయంగా మార్చేందుకు పోలీసులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు సీఐ సంజయ్‌, ఎస్సై వెంకట్‌ కృష్ణ ఇటీవల పాత భవనం వద్ద పిచ్చి మొక్కలను తొలగించారు. ఏఎస్పీ చిత్తరంజన్‌ స్టేషన్‌భవనాన్ని పరిశీలించి గ్రంథాలయం ఏర్పాటుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. త్వరలో భవనానికి రంగులు వేసి గ్రంథాలయం ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రెబ్బెన శాఖ గ్రంఽథాలయ భవనం శిథిలావస్థలకు చేరుకున్నది. సుమారు 470 మంది డిపాజిట్‌ దారులు ఉన్నారు. 4,650 పుస్తకాలున్నాయి. ప్రతి రోజు 50 మంది పాఠకులు ఇక్కడ వస్తుంటారు. కానీ గ్రంఽథాలయానికి పక్కా భవనం లేక పోవడంతో పాఠకులు ఇబ్బందులు పడుతున్నారు. ఇది శిథిలావస్థకు చేరడంతో వర్షాకాలం పైకప్పు ఊరు స్తుండడంతో పుస్తకాలు కూడా తడుస్తున్నాయి. కేవలం మూడు గదులు ఉండగా, ఒక గది పాఠకుల కోసం, మరో గదిని స్టోర్‌ రూం కేటాయించారు. ఇరుకిరుగా గాలి, వెలుతురు సరిగా లేక పోవడంతో పాఠకులు ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొన్నది. రెబ్బెన పోలీస్‌స్టేషన్‌ పాత భవంనలో గ్రంథాలయం ఏర్పాటైతే పాఠకులకు కావాల్సిన అన్ని వసతులు అందుబాటులోకి రానున్నాయి. రెండు విశాలమైన గదులు, మరో మూడు చిన్నగదులతో పాటు మరుగుదొడ్డి, తాగునీటి సౌకర్యం ఈ భవనంలో ఉన్నాయి. పుస్తకాలు భద్రపరిచేందుకు స్టోర్‌ రూం ఉన్నాయి. ప్రధాన రోడ్డుపైనే ఉండడంతో గ్రంథాలయానికి వచ్చే పాఠశాలకుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఈ గ్రంథాలయం అందుబాటులోకి వస్తే నిరుద్యోగులకు ఎంతగానో ఉపయోగపడనుంది.

త్వరలోనే ప్రారంభించేందుకు చర్యలు..

- వెంకటకృష్ణ, రెబ్బెన ఎస్సై,

పోలీస్‌స్టేషన్‌ పాత భవనాన్ని గ్రంథాలయంగా మార్చాలని నిర్ణయించాం. విష యాన్ని ఎస్పీ, ఏఎస్పీ దృష్టికి తీసుకెళ్లాం. ఇందుకు వారు అంగీకరించి ప్రత్యేక చొరవ చూపారు. భవనంల ఆవరణలో పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రం చేయించాం. భవనానికి రంగులు వేయించి త్వరలోనే గ్రంథాలయాన్ని ప్రారంభిస్తాం.

Updated Date - Nov 08 , 2025 | 10:36 PM