kumaram bheem asifabad- గ్రంథాలయాలు విజ్ఞాన నిలయాలు
ABN , Publish Date - Nov 20 , 2025 | 11:00 PM
గ్రంథాయాలు విజ్ఞాన నిల యాలని, పాఠకులు, విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవస రమైన విజ్ఞానం గ్రంథాయాలలో లభిస్తుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ శాఖలో గురువారం నిర్వహించిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీష్‌బాబుతో కలిసి హాజరయ్యారు.
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): గ్రంథాయాలు విజ్ఞాన నిల యాలని, పాఠకులు, విద్యార్థులు, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు అవస రమైన విజ్ఞానం గ్రంథాయాలలో లభిస్తుందని అదనపు కలెక్టర్ దీపక్ తివారి అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా కేంద్ర గ్రంథాలయ శాఖలో గురువారం నిర్వహించిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే హరీష్‌బాబుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రంథాల యాలు విజ్ఞాన భాండాగారాలని మన అందరికి అవసరమైన విజ్ఞానం లభిస్తుందని తెలిపారు. గ్రంథాలయాలలో పాఠకుల కోసం, పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థు లకు చరిత్రకు సంబందించిన పుస్తకాలు, దినపత్రికలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పోటీ పరీక్షల అభ్యర్థులు గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాలలో భాగంగా అనేక కార్యక్రమాలు నిర్వహించామని తెలిపారు. ఎమ్మెల్యే హరీష్‌బాబు మాట్లాడుతూ జిల్లా కేంద్ర గ్రంథాలయంలో పాఠకుల కోసం మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. పాఠకు లు, యువత గ్రంథాల యాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. అనంతరం జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలిచిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ అలీబీన్ అహ్మద్, మాజీ జడ్పీటీసీ అరిగెల నాగేశ్వర్‌రావు, జిల్లా గ్రంథాలయ కార్యదర్శి సరిత తదితరుల