Share News

kumaram bheem asifabad- దేశ పురోగతి కోసం కలిసి నడుద్దాం

ABN , Publish Date - Nov 14 , 2025 | 10:02 PM

దేశ పురోగతి కోసం మహనీయుల ఆశయాల స్ఫూర్తిగా కలిసి నడుద్దామని ఆదిలాబాద్‌ ఎంపీ గొడెం నగేష్‌ అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కేంద్ర యువజన క్రీడ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేరా భారత్‌ ఐక్యత మార్చ్‌ కార్యక్రమానికి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, జిల్లా అధికారులు, ఉవజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులతో కలిసి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు.

kumaram bheem asifabad- దేశ పురోగతి కోసం కలిసి నడుద్దాం
ర్యాలీలో పాల్గొన్న ఎంపీ, ఎమ్మెల్యే, కలెక్టర్‌, జిల్లా అధికారులు

ఆసిఫాబాద్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి): దేశ పురోగతి కోసం మహనీయుల ఆశయాల స్ఫూర్తిగా కలిసి నడుద్దామని ఆదిలాబాద్‌ ఎంపీ గొడెం నగేష్‌ అన్నారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కేంద్ర యువజన క్రీడ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేరా భారత్‌ ఐక్యత మార్చ్‌ కార్యక్రమానికి కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు, జిల్లా అధికారులు, ఉవజన సంఘాల ప్రతినిధులు, విద్యార్థులతో కలిసి హాజరై జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం కలెక్టరేట్‌ నుంచి కుమరం భీం చౌరస్తా మీదుగా తిరిగి కలెక్టరేట్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా సర్దార్‌వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ దేశ పురోగతి కోసం అందరం కలిసి నడుద్దామని తెలిపారు. సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ దేశం కోసం, దేశ ఐక్యత కోసం కృషి చేశారని చెప్పారు. స్వాతంత్ర్యోద్యమ పోరాటంలో తన వంతు పాత్ర పోషించారని అన్నారు. వ్యూహాత్మక దృఢత్వం, విలీన సాధనం ద్వారా ఎన్నో రాజరిక రాజ్యాలను విజయవంతంగా ఏకం చేసి భారతదేశాన్ని ఒక సమగ్రమైన స్థిరమైన దేశంగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ మలిచారని కొనియాడారు. ఏక్‌ భారత్‌- ఆత్మ నిర్భర్‌ భారత్‌ ద్వారా స్వదేశీ ఉత్పత్తులను ఉపయోగించి దేశ ఆర్థిక రంగాన్ని బలోపేతం చేశారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే హరీష్‌బాబు, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రేలు మాట్లాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు రమాదేవి, అహ్మద్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 10:02 PM