kumaram bheem asifabad- పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుదాం
ABN , Publish Date - Dec 01 , 2025 | 10:14 PM
పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచే అభ్యర్థులను పెద్ద సంఖ్యలో గెలిపించుకుని సత్తా చాటుదామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి, పాడిబండ గ్రామ పంచాయతీల పరిధిలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, మహిళలు, కార్యకర్తలు ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు.
ఆసిఫాబాద్, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచే అభ్యర్థులను పెద్ద సంఖ్యలో గెలిపించుకుని సత్తా చాటుదామని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. ఆసిఫాబాద్ మండలం రౌటసంకెపల్లి, పాడిబండ గ్రామ పంచాయతీల పరిధిలో వివిధ పార్టీలకు చెందిన ముఖ్య నాయకులు, మహిళలు, కార్యకర్తలు ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆధ్వర్యంలో సోమవారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే కండువా వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాత్లాడుతూ రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బలపరిచే అభ్యర్థుల గెలుపు కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని పిలుపునిచ్చారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్‌ఎస్ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.
తిర్యాణి, (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక విధానాలకు విసుగు చెందిన మండల ప్రజలు పంచాయతీ ఎన్నికల్లో తగిన గుణ పాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని బీఆర్‌ఎస్ మండలాధ్యక్షుడు జగదీష్ అన్నారు. మండలంలోని తెలండి గ్రామ పంచాయతీలో గల కోతెలండి గ్రామానికి చెందిన దిందర్శ, రాజు, జైత్, తిరుపతి, సోనీరావు, గుణవంతరావు, అర్జున్, భగవంత్‌రావు, గంగారాం, శంకర్,మెంగారావుతో పాటు 50 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్ పార్టీలో సోమవారం చేరారు. ఈ సందర్భంగా వారికి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. కార్యక్రమంలో నాయకులు వీనివాస్, చంద్రశేఖఱ్, సుజాత, లచ్చన్న, మల్లేష్, శంకర్, మధుకర్, దేవేందర్, సంతోష్, లక్ష్మణ్‌గౌడ్, కుమార్, వినోద్ తదితరులు పాల్గొన్నారు.