Share News

స్థానిక సంస్థల్లో సత్తా చాటుదాం

ABN , Publish Date - Oct 19 , 2025 | 11:57 PM

స్థా నిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ సత్తాచాటు తుందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు.

స్థానిక సంస్థల్లో సత్తా చాటుదాం
బిజినేపల్లిలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో బీజేపీలో చేరిన యువకులు

- మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు సమక్షంలో బీజేపీలో భారీగా చేరికలు

బిజినేపల్లి, ఆక్టోబరు 19 (ఆంధ్రజ్యోతి) : స్థా నిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ సత్తాచాటు తుందని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మండల కేంద్రంలో బీజేపీ మండల కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స మావేశంలో వివిధ పార్టీల నుంచి భారీగా తరలి వచ్చిన యువకులకు ఆయన బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించి మాట్లాడారు. బీఆర్‌ ఎస్‌ నుంచి బయటకు వచ్చి సిద్ధాంతం కోసం, దేశ రక్షణ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ప్ర ధానమంత్రి నరేంద్రమోదీ పాలనకు ఆకర్షితు డినై బీజేపీలో చేరి ధర్మ పోరాటం సాగిస్తున్నా నని అన్నారు. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్‌ఎస్‌ అంతర్గత కుమ్ములాటలతో చేవచచ్చిపడిపోయిం దని విమర్శించారు. అధికార కాంగ్రెస్‌ పార్టీ నా యకులు ఎన్నికల ముందు అలవికాని హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, ప్రజలకు అం డగా ఉండి రాష్ట్ర ప్రభుత్వంపై ధర్మ యుద్ధం చేసేందుకు యువకులు కలిసి రావాలని కోరారు. ప్రజలు మేల్కొని బీజేపీ అభ్యర్థులను పంచా యతీ ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. కార్యక్ర మంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నెడనూరి దిలీ పాచారి, జిల్లా అధికార ప్రతినిధి సోలంకి శ్రీనివాస్‌, నాగేంద్రంగౌడ్‌, తిరుపతయ్య, సుధాకర్‌ రెడ్డి, మైనార్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు జాకీర్‌ హుస్సేన్‌, శ్రీరాములు, నారాయణాచారి, దోమ తిరుపతిరెడ్డి, చీర్ణం తిరుపతయ్య, జిల్లా మహిళా మోర్చా కార్యదర్శి చంద్రకళ, లక్ష్మీ నారాయణ, రాగి సత్యనారాయణ, నరసింహ, శేఖర్‌ తదితరులు ఉన్నారు.

Updated Date - Oct 19 , 2025 | 11:57 PM