ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం..
ABN , Publish Date - May 31 , 2025 | 10:38 PM
ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండారపు చక్రపాణి అన్నారు. శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో విధ్యార్థుల సంఖ్య పెంచేందుకు టిస్ యుటిఎఫ్ ఆధ్వర్యం లో మండలంలోని పలు గ్రామాల్లో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు.
టీఎస్ యుటీఎఫ్ జిల్లా అద్యక్షుడు చక్రపాణి
లక్షెట్టిపేట, మే 31(ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకోవాల్సిన బాద్యత ప్రతీ ఒక్కరిపై ఉందని టీఎస్ యుటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు గుండారపు చక్రపాణి అన్నారు. శనివారం ప్రభుత్వ పాఠశాలల్లో విధ్యార్థుల సంఖ్య పెంచేందుకు టిస్ యుటిఎఫ్ ఆధ్వర్యం లో మండలంలోని పలు గ్రామాల్లో బడి బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు భోదించేందుకు అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులచే విద్యా భోదన ఉంటుందన్నారు. గ్రామాల్లో వాడ వాడన తిరుగుతు విద్యా ర్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల వసతిపై అవగాహన కల్పిస్తూ పిల్లలను చే ర్పించే విధంగా అవగాహన కల్పించారు. ఈకార్యక్రమంలో సంఘం ప్రధానకార్యదర్శి గుర్రల రాజవేణు, ఉపాద్యక్షులు కిరణ్ కుమార్, కార్యదర్శులు చంద్రమౌళి, నర్సయ్య పాల్గొన్నారు.
దండేపల్లి : ప్రభత్వ పాఠశాలల్లో పిల్లలను చేర్పించాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గుం డారపు చక్రపాణి, గుర్రాల రాజావేణు పిలుపునిచ్చారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా శనివారం మండ లం లోని పలు గ్రామాలలో ప్రచార జాత నిర్వ హించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిం చి ఫీజుల భారం లేని ఉచిత విద్యను పొందాలని వారు సూచించారు. ఈ ప్రచారంలో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు కిరణ్ కుమార్, జిల్లా కార్యదర్శులు చంద్రమౌళి, నర్సయ్య, పాల్గొన్నారు.
హాజీపూర్: తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టీఎస్‌యుటీఎఫ్ జిల్లా కార్యదర్శులు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజవే ణులు పిలుపునిచ్చారు. శనివారం హాజీపూర్ మండల కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపు దలకు ప్రచార జాత కార్యక్రమం నిర్వహించారు. మండలంలోని పలు గ్రామాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమం లో జిల్లా ఉపాధ్యక్షులు కిరణకుమార్, కార్యదర్శులు చంద్రమౌళి, నర్సయ్యలు పాల్గొన్నారు.