Share News

ప్రభుత్వ బడిని కాపాడుకుందాం

ABN , Publish Date - Jun 01 , 2025 | 11:15 PM

తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టీఎస్‌ యుటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజవేణు పిలుపునిచ్చారు.

ప్రభుత్వ బడిని కాపాడుకుందాం
గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తున్న టీఎస్‌యుటీఎఫ్‌ నాయకులు

పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పిద్దాం..

జన్నారం, జూన్‌1(ఆంధ్రజ్యోతి): తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని, ప్రభుత్వ బడులను కాపాడుకోవాలని టీఎస్‌ యుటీఎఫ్‌ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండారపు చక్రపాణి, గుర్రాల రాజవేణు పిలుపునిచ్చారు. శవావారం నుం చి ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కోసం టీఎస్‌యుటీ ఎఫ్‌ మంచిర్యాల జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రచా రజాత జన్నారం మండలంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలాలు ఉన్నాయని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ బడుల్లో చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని పిలు పునిచ్చారు. ప్రతి గ్రామానికి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిం చాలని జూన్‌5 వరకు ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు. ఈసందర్భంగా జన్నారం మడలంలోని తిమ్మాపూర్‌, రాంపూర్‌, తపాలాపూర్‌, చింతగూడ, పొన్కల్‌, జన్నారం, సూరారం, గూడెం, రేండ్లగూడలో ప్రచారం నిర్వహిం చారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు కరణ్‌కుమార్‌, జిల్లా కార్యద ర్శులు చంద్రమౌళి, నర్సయ్య, దండేపల్లి మండలం అధ్యక్షులు తులసి పతి, జన్నారం మండలం ప్రధాన కార్యదర్శి నర్సయ్యలు పాల్గొన్నారు.

Updated Date - Jun 01 , 2025 | 11:15 PM