Share News

kumaram bheem asifabad- నులిపేద్దాం

ABN , Publish Date - Aug 09 , 2025 | 11:15 PM

కడుపు లో నులిపురుగులతో పిల్లలు అనారోగ్య సమస్యల తో బాధపడుతుంటారు. వాటిని దూరం చేసి చిన్నారులు అరోగ్యవంతంగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసు కుంటోంది. ఇందులో భాగంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేపడు తోంది.

kumaram bheem asifabad- నులిపేద్దాం
లోగో

- నివారణకు అల్బెండజోల్‌ మాత్రలు

- రేపటి నుంచి పంపిణీకి అధికారుల ఏర్పాట్లు

ఆసిఫాబాద్‌రూరల్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): కడుపు లో నులిపురుగులతో పిల్లలు అనారోగ్య సమస్యల తో బాధపడుతుంటారు. వాటిని దూరం చేసి చిన్నారులు అరోగ్యవంతంగా ఎదిగేందుకు ప్రభుత్వం చర్యలు తీసు కుంటోంది. ఇందులో భాగంగా 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలను పంపిణీ చేపడు తోంది. ఈ మేరకు జిల్లాలోని వైద్యశాఖ అధికారులు అందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 11, 18 తేదీల్లో పాఠశా లలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలలో నులిపురుగు నివారణ మాత్రలను పంపిణీ చేయనున్నారు.

- వ్యాప్తి ఇలా..

అపరిశుభ్ర వాతావరణం, మురుగు కాలువలు, నిలు వ నీరు, జంతువుల మలం తదితరాలు నులి పురుగు వ్యాప్తికి కారణం. నిల్వ ఉన్న చెడిపోయిన ఆహారం, ఉడకని మాంసం వంటివి కూడా నులి పరుగుల వ్యాప్తికి కారణమవుతాయి. తీపి, పిండి పదార్థాలు ఎక్కు వగా తీసుకున్నా, మలబద్దకం ఉన్నా నులిపురుగులు త యారవుతాయి. పిల్లలు మట్టిలో ఆడుకున్నపుడు గోళ్లలో మట్టి ఉండిపోతుంది. చేతులను నోట్టో పెట్టుకోవడం, చేతులను కడగకుండా బోజనం చేయడం వంటి కారణా లతోనూ నులి పురుగులు సోకుతాయి.

- ఇవీ లక్షణాలు..

నులి పురుగులు పొట్టలో చేరి ఆపై మలద్వారం వద్ద గుడ్లు పెడతాయి. దీంతో దుర దగా ఉంటుంది. తెల్లమ చ్చలు కనిపిస్తాయి. అజీర్ణంతో పాటు వాంతులు, విరేచ నాలు అవుతుంటాయి. కొన్ని సందర్భాల్లో రక్తహీనత లాంటివి తప్పవు. వాటితో పాటు వృద్ధి చెందే ఇతర క్రీముల వల్ల శక్తి క్షీణించడం, శారీరక ఎదుగుదల ఉండకపోవడం వంటివి ఎదురవుతాయి.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఆహారం తీసుకునే ముందు చేతులను సబ్బు తో శుభ్రంగా కడ గాలి. పిల్లలకు దీనిపై అవగాహన కల్పించాలి. చేతిగోళ్లు చిన్నవిగా కత్తిరిం చుకోవాలి. గోళ్లలో మట్టి లేకుండా చూసుకోవాలి. పాదరక్షలు ధరించాలి. అప్పుడే తయారు చేసిన వేడి ఆహారం తీసుకోవాలి. పిల్లలకు తీపి పదా ర్థాలు, చాక్లెట్లు, మలబ ద్దకానికి కారణమయ్యే మైదా పిండి వంటలు బాగా తగ్గించాలి. 1 నుంచి 19 ఏళ్లలోపు పిల్లలందరికీ అల్బెండజోల్‌ మాత్రలను తప్ననిసరిగా వేయించాలి.

జిల్లాలో ఇలా..

జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు 28, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు 909, అంగ న్‌వాడీ కేంద్రాలు 919 ఉన్నాయి. ఇందులో ఒకటి నుంచి ఐదు వరకు అంగన్‌ వాడీ కేంద్రాలలో 36వేల మంది ఉన్నారు. ప్రభుత్వ పాఠశాల/కళాశాలల్లో 6 నుంచి 19 వరకు 1,27, 907 మంది, బడిబయట ఉన్న 6నుంచి19 వరకు 3,795 మం ది ఉన్నారు. మొత్తం జిల్లాలో 1,67,702 మంది (1 నుం చి 19) పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలు వేయాలని నిర్ణయించారు.

ఏర్పాట్లు పూర్తి చేశాం..

- సీతారాం, జిల్లా వైద్యాధికారి

జిల్లాలో సోమవారం నిర్వహించే జాతీయ నులిపు రుగుల దినోత్సవానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. జిల్లాలో 1,67,702 మంది పిల్లలకు అల్బెండజోల్‌ మాత్రలు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. 1నుంచి19 ఏళ్ల వయస్సుగల అంగన్‌వాడీ, ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు/కళాశాల పిల్లలకు ఈ మాత్రలు వేయనున్నాం. ఈనెల 11న తప్పిన పిల్లలకు ఈనెల 18న వేసేందుకు చర్యలు తీసుకుంటాం.

Updated Date - Aug 09 , 2025 | 11:15 PM